గ్రామాల్లో జనసేన అభ్యర్థి సంపత్ నాయక్ విస్తృత ప్రచారం

తెలంగాణ, వైరా, ఏన్కూరు మండలంలో వైరా నియోజకవర్గ ఉమ్మడి బిజెపి, జనసేనపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సంపత్ నాయక్ ప్రచారం నిర్వహించారు. టిఎల్ పేట, లచ్చగూడెం, బి ఆర్ పురం, రాజలింగాల, తిమ్మారావుపేట, ఎర్రబోడు తండా, రాయమాదారం, ఏన్కూర్ గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ నాయక్ మాట్లాడుతూ జనసేన బిజెపి ప్రభుత్వ ఏర్పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులకు ఎంతో అవసరమని “గ్లాస్ గుర్తు” కి మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. తొలుత టిఎల్ పేట దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి బిజెపి జనసేన నాయకులు వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరి కోటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొవ్వూరి నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు నల్లబోతుల రమేష్, జనసేన మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ నరకుళ్ళ వెంకటేశ్వర్లు, బోల్లి వెంకటేశ్వర్లు, కొవ్వూరి మహేష్, రెంటపల్లి నారాయణ, పసుపులేటి కృష్ణ, పాశం భరత్, అన్నమయ్య, సతీష్, రాజేందర్, వీరభద్రం, నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.