కారకులైన వారిని వెంటనే కనిపెట్టాలని జనసేన డిమాండ్

గుంటూరు జనసేన పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. గుంటూరు మున్సిపాలిటీ పరిధిలో సిటీ కేబుల్ వైర్లు కట్ చేసిన విషయంపై, రాష్ట్రంలో జగన్ రెడ్డి రాజ్యాంగ విరుద్ధ పాలనపై జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ప్రసంగించారు. గాదె మాట్లాడుతూ.. గుంటూరు కార్పొరేషన్ పరిధిలో సిటీ కేబుల్ వైర్లు కట్ చేయడాన్ని జనసేన పార్టీ తరవున ఖండిస్తున్నాము. దీనికి కారకులైన వారిని వెంటనే కనిపెట్టాలని అధికారులని డిమాండ్ చేస్తున్నాము. వారిచేత కాంపెన్సేషన్ కట్టించి బాధితులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము. తాడికొండ నియోజకవర్గ నుండి గెలిచిన అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గారు నేడు హైదరాబాద్ నుండి గుంటూరు జిల్లాకు రావాలంటే ఎస్సీ-ఎస్టీ కమిషన్ లో ఫిర్యాదు చేసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ ని, పోలీసు శాఖ వారిని రక్షణ కోసం అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ పాలన ఎంత రాక్షసంగా ఉంది అనేది స్పష్టంగా అర్ధం అవుతుంది. జగన్ రెడ్డి మాట మాట్లాడితే ప్రతిపక్షాన్ని దాచుకున్నారు, దోచుకున్నారు అని విమర్శిస్తూ ఉంటాడు. ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యేనే దోచుకునేది ముఖ్యమంత్రి అని స్పష్టంగా చెప్పేసింది. దాని గురించి వివరణ ఇచ్చేందుకు గాని, అబద్ధం అని నిరూపించేందుకు గుంటూరు జిల్లా వైసీపీలో ఎవరు లేరన్నట్టు ఉత్తరాంధ్ర నుంచి ఆయానేవారో ఉండవల్లి-ఊసరవెల్లి అనుకుంటూ వచ్చేసాడు. అసలు ఎమ్మెల్యేలకే రక్షణ లేదు అంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? దానికి ఉదాహరనే గుంటూరు మున్సిపాలిటీ పరిధిలోని సిటీ కేబుల్ ఘటన. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు కూడా మీడియా సాక్షిగా మాట్లాడకూడదు అంటూ వీళ్ళ డబ్బుతో సలహాదారుడిగా నియమితుడైన వాడు ఎమ్మెల్యేలకు రేట్లు కడతాడు. రాష్ట్ర ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని ఏ రకంగా అబద్దాలు ఆడుతున్నారు అనడానికి నిదర్శనం నిన్న ఆసరా పేరు మీద దెందులూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి మాటలు. దానికి సంబంధించి వచ్చిన పేపర్ ప్రకటనల్లో సిగ్గు లేకుండా వేసుకున్న అబద్దాలు ఇప్పటి వరకు ఆంధ్రరాష్ట్రంలో ‘5 కోట్ల 47 లక్షల 31 వేల 4 వందల 13 మంది’ అక్కచెల్లెమ్మలకు ఆసరా ఇచ్చారని ప్రకటనలు చేసుకున్నారు. ఆ ప్రకటనలు ఇచ్చిన పెద్దలని, రాష్ట్రంలో ఉన్న సలహాదారులని, ఈ ముఖ్యమంత్రిని జనసేన పార్టీ నుండి అడుగుతున్నాము.. ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఎంత? అందులో మహిళలు ఎంత మంది? మీరు ప్రకటనల్లో ఇచ్చుకున్నట్టుగా గత 45 నెలల నుండి 5 కోట్ల 47 లక్షల 31 వేల 4 వందల 13మంది అక్క చెల్లెమ్మలకు ఆసరా ఇవ్వాలి అంటే ఎన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళలందరిని కలపాలి? మీరు చూపించిన ఈ దొంగ లెక్కల్లో 40 శాతం వాస్తవం అనుకున్నా మిగిలిన 60 శాతం మీరు నేర్చిన విద్య ‘రివర్స్ టెండరింగ్’ రూపంలో మళ్ళీ మీకే వచ్చేసిందా?? ఇవి మీ జేబులు నింపుకునే లెక్కలు కావా? దీని మీద ప్రభుత్వ పెద్దలు వివరణ ఇవ్వాలి. ఈ దొంగ లెక్కలు చూపించి ఎవరి జేబుల్లోకి ప్రజాధనం వెళ్తుందో సమీక్ష చెయ్యాలి. లేకపోతే జనసేన పార్టీ తరవున రాష్ట్ర వ్యాప్తంగా ధరలకు దిగుతాం. ఇప్పటికే అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోయారు. అది పట్టించుకోకుండా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం జట్లు కట్టేందుకు గొడ్లను ఒక షెడ్డు కింద పెట్టి పాలేరుని కాపలా పెట్టినట్టు ప్రజాప్రతినిధులను గ్రూపులు చేసుకునేందుకు సమయం ఉంటుంది. వివేనకానంద రెడ్డి హత్య కేసు విషయం మీద ఢిల్లీకి పరుగు తీసేందుకు సమయం ఉంటుంది. బటన్ లు నొక్కేందుకు సమయం ఉంటుంది కానీ ఒక్క రోజు కూడా కనీసం ఒక్క జిల్లా లేదా ఒక్క ప్రాంతాన్ని సందర్శించేందుకు కానీ, ఆ శాఖకు చెందిన ఆమాత్యునితో జరిగిన నష్టంపై సమీక్ష చేసేందుకు గాని సమయం ఉండదు ఈ ముఖ్యమంత్రికి. జనసేన పార్టీ నుండి వారం రోజుల క్రితమే డిమాండ్ చేసాం అధికారులు రైతులని ఆదుకోవాలి, జరిగిన నష్టంపై సమీక్ష చేసి రైతులకు భరోసానివ్వాలి అని. అది పెడచెవిన పెట్టేసారు. ఇకనైనా ప్రభుత్వం అధికారులతో సమీక్షలు నిరవహిచాలి. ఈ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి రైతులని పరామర్శిస్తారన్న నమ్మకం ఎవరికి లేదు. బయటకి వస్తే పరదాల చాటున ఉండే ఈ ముఖ్యమంత్రి ప్రజలను ఏరోజూ కలిసిన పాపాన పోలేదు. కనీసం అధికారులతోనైనా సమీక్షలు నిర్వహించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము. వారం రోజులోగా లక్షన్నార ఖర్చుపెట్టి ఉద్యానవన పంటలు వేసిన రైతులకు న్యాయం చెయ్యకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. రాష్ట్ర ప్రజలను ఒక్కటే కోరుకుంటున్నాం. నాలుగు సంవత్సరాలుగా అధికార వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుంది, ఏ విధంగా ప్రజల జీవితాలను అగమ్యగోచ పరిస్థితుల్లో పడేస్తుంది అనే విషయాలను గమనించండి. మీ కోసం నిరంతరం కష్టపడే, మీకు అండగా ఉండే జనసేన పార్టీని ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, జనసేన కార్పొరేటర్ యర్రంశెట్టి పద్మావతి, శిఖా బాలు, దాసరి వెంకటేశ్వరరావు, నెల్లూరు రాజేష్, తుమ్మల నరసింహారావులు పాల్గొన్నారు.