అన్నవరం నుండి వర్తనపల్లి వరకు రోడ్డు నిర్మాణం ఎందుకు పూర్తి చెయ్యలేదు?: వంతల బుజ్జిబాబు

  • గిరిజనులు కష్టాలను తీర్చేది ఎవరు?

చింతపల్లి : అల్లూరి సీతారామ రాజు జిల్లా, పాడేరు, చింతపల్లి మండలం, తమ్మంగుల, అన్నవరం పంచాయతీ చెందిన కొత్తూరు బయలు, గాలిపాడు, సుదగరువు, వర్తనపల్లి గ్రామాల వరకు రోడ్డు నిర్మాణానికి టీడీపీ హయాంలో శంకుస్థాపన జరిగినా, ఈ రోడ్డు నిర్మాణం ఇప్పటివరకు ఎందుకు పూర్తి కాలేదని జనసేన పార్టీ చింతపల్లి నాయకులు వంతల బుజ్జిబాబు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నవరం నుంచి వర్తనపల్లి గ్రామం వరకు రోడ్డు నిర్మాణం టీడీపీ ప్రభుత్వం అధికారంలో సాధ్యం కాలేదు.. కనీసం ఇప్పటి వైసీపీ ప్రభుత్వం అయినా ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. ప్రజలు కష్టాలను టీడీపీ, వైవీపీ ప్రభుత్వం గుర్తించాలి. ప్రజలు తమ నాణ్యమైన ఓటుతో మిమ్మల్ని ఓటు వేసి గెల్పించారు, మీ ప్రభుత్వం గిరిజన ప్రజలను గుర్తించదా..?. పాడేరు నియోజకవర్గంలో అప్పుడు టీడీపీ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇప్పుడు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి వంటి గిరిజన బిడ్డలు గెలిచినప్పటికి గిరిజన ప్రజలుకు మాత్రం ఎటువంటి న్యాయం జరగ లేదు. కులం, మతం, బాషా వేరు చేసి మాట్లాడుతున్న ఇటువంటి ఎమ్మెల్యేలను ఎలా ఊరుకోవాలి. అలాగే ఆ యొక్క గ్రామాల నుంచి రోగులను, గర్భిణీ స్త్రీలను హాస్పిటల్ లకు తరలించడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఇలాంటి గిరిజన ప్రజల కష్టాలను ప్రభుత్వమే ఆదుకోవాలి. ఆ రహదారిలో వాహనాలు నడపడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆ రహదారిలో పిక్కే రాయిలు వేసి టీడీపీ ప్రభుత్వం పూర్తి చెయ్యకుండా పనులను మధ్యలో ఆపేసారు. కనీసం వైసీపీ ప్రభుత్వం అయినా గిరిజనలు పడుతున్న ఇబ్బందులు చూసి ఆ రహదారి నిర్మాణాన్ని పూర్తి చెయ్యాలని ప్రభుత్వాన్న్ని డిమాంద్ చేసారు. మా యొక్క జనసేన ప్రభుత్వం 2024 నాటికీ అధికారంలో వస్తే తక్షణమే ఈ పరిస్థితులను, గిరిజనులు పడుతున్న ఇబ్బందులు, బాధలనుతక్షణమే పరిష్కరిస్తుందని గిరిజన గ్రామ ప్రజలకు బుజ్జిబాబు తెలియజేసారు.