మామిడికుదురు జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

రాష్ట్రంలో రోడ్ల దుస్థితి పై జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు #GoodMorningCMSir డిజిటల్ క్యాంపైనింగ్ లో భాగంగా 3వ రోజు ఆదివారం మామిడికుదురు, కొమరాడ, ఈదరాడ, మగటపల్లి, గోగన్నమఠం, మగటపల్లి – చెన్నాడం మెయిన్ రోడ్ల దుస్థితి పై మగటపల్లి గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరిగింది.