సమస్యలు పట్టని ముఖ్యమంత్రిని మేల్కొల్పేందుకే గుడ్ మార్నింగ్

మైలవరం, జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం, జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షుడు శీలం బ్రహ్మయ్య ఆధ్వర్యంలో “గుడ్ మార్నింగ్ సీఎం సార్” ప్రోగ్రాంలో భాగంగా మైలవరం నుండి వెల్వడం, చంద్రాల, వెదురుబిడెం వెళ్లే రోడ్డు మార్గంలో గల గుంతలను, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల దుస్థితిని వివరిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జనసేనపార్టీ రాష్ట్రఅధికారప్రతినిధి, మైలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అక్కల రామ్మోహన్ రావు(గాంధీ)మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అద్వానంగా ఉన్న రోడ్ల దుస్థితి వివరిస్తూ “గుడ్ మార్నింగ్ సీఎం సార్” అనే ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందులో భాగంగానే మైలవరం, వెల్వడం గ్రామంలో గల రోడ్లు అద్వాన్నంగా ఉన్నాయని, ప్రమాదకరమైన గుంతలను సైతం తట్టెడు మట్టి వేయలేదని, గుంతల వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గాఢ నిద్రలో ఉన్నారని ఆయన మేల్కొల్పేందుకే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. వెంటనే రోడ్లను మరమ్మతు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గుంతలో పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ దోసపాటి శశికళ, మైలవరం మండల కమిటీ నాయకులు పడిగల ఉదయ్, చంద్రాల మురళీకృష్ణ, ఈతకొట్టు నాని, ఆకుతోట ఈశ్వర్, మల్లారపు దుర్గాప్రసాద్, ఆనం విజయ్ కుమార్, రమేష్ బాబాయ్, తాళ్ల శివకృష్ణ, మాదాసు సుబ్బారావు, ఉయ్యూరు నాగరాజు, చల్ల నాగరాజు, పౌల్ రాజు మరియు జనసైనికులు వేమిరెడ్డి వంశీ కృష్ణారెడ్డి, మర్రి కొండలరావు, ఎడ్ల హర్ష, పడగల నాగరాజు, గుర్రం వెంకటేశ్వరరావు, శీలం చందు, ఎడ్ల రామకృష్ణ, తోమండ్రు నవీన్, పసుపులేటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.