సింగరాయకొండలో జనంకోసం జనసేన

ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలంలో జనంకోసం జనసేన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు పాత సింగరాయకొండలోని ఎస్సీ కాలనీ పర్యటించడం జరిగినది. ఈ కాలనీ ప్రజలు జనసేన నాయకులకు కాలనీలో ఉన్న పలు సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా మంచినీటి సదుపాయం లేదని అలాగే బోరింగులు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పనిచేయట్లేదు, బోరింగులు మరమ్మతులు చేసే స్థితి కూడా లేదని, డ్రైనేజీ వ్యవస్థ అద్వానంగా తయారయ్యిందని కాలనీవాసులు తెలిపారు. ముఖ్యంగా ఈ కాలనీలో వాటర్ ప్లాంట్ ఉంది కానీ అది రిపేర్ అయి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు మరమ్మత్తులకు నోచుకోలేని పరిస్థితి ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాగడానికి నీళ్లు లేక బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎస్సీ కాలనీ పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ఈ కాలనీ ప్రజలతో జనసేన పార్టీ సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్ మాట్లాడుతూ, ఎస్సీ కాలనీ సమస్యల గురించి జనసేన దృష్టికి వచ్చిందని ఎస్సీ కాలనీకి మంచినీటి వాటర్ ప్లాంట్ మరమ్మత్తులు చేయటానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని, అలాగే బోరింగులు మరమ్మత్తులు విషయంపై సంభందిత అధికారులు దుష్టి కి తీసుకోని వెళ్తామని, అలాగే సమస్యలు పరిష్కారం కానీ పక్షం లో నిరసన కార్యక్రమం చేపట్టడానికి కూడా వెనుకాడబోమని కాలనీ ప్రజలకు బరోసా కలిపించటం జరిగింది. అలాగే ఎస్సీ కాలనీకి జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు అయినా బత్తిన రాజేష్, మండల నాయకులు కాసుల శ్రీనివాస్, అనుముల శెట్టి కిరణ్ బాబు, గుంటుపల్లి శ్రీనివాస్, సంకే నాగరాజు, సయ్యద్ చాన్ భాషా, పోలిశెట్టి విజయ్ కుమార్, షేక్ మా బాషా, నామ వెంకటేష్, షేక్ సుల్తాన్ భాషా, షేక్ సుభాని, తగరం రాజు, చలంచర్ల కరుణ్ కుమార్, పాలకుర్తి శ్రీనాథ్, సిమోను, మరియు జన సైనికులు పాల్గొన్నారు.