నగరి నియోజకవర్గంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నగరి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగిరి నియోజకవర్గంలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరి మండల అధ్యక్షుడు దేవ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ నగరి నియోజకవర్గం సమన్వయ కార్యకర్త మెరుపుల మహేష్, మండల అధ్యక్షలు ఉపేంద్ర, స్వామిాథన్, జగదీష్, మునిశేఖర్, వెంకట ముని, శివలింగం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ రూరల్ బ్యాంక్ అధ్యక్షులు సురేష్, చిత్తూరు జిల్లా అధికార ప్రతి నిధి జ్యోతి నాయుడు పట్టణ అధ్యక్షులు రమేష్, మరియు జనసేన పార్టీమండల నాయకులు నవీన్, గిరి, రూపేష్, శివ, చిరంజీవి, కార్యకర్తలు హాజరు కావడం జరిగింది.