పాలకొండ నియోజకవర్గంలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం జనసేన పార్టీ 10వ ఆవిర్భావదినోత్సవం సందర్బంగా గేడగాం గ్రామంలో జనసేన పార్టీ జెండా 20 అడుగుల ఎత్తులో జెండా ఎగురవెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన జానీ మాట్లాడుతూ ఈ 10 సంత్సరాల జనసేన పార్టీ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ 2024లో జనసేన పార్టీ ఒక బలమైన శక్తిగా ఏదిగే దిసగా గొప్పగా పార్టీని బలోపేతం చేశారు. అందుకు జనసేన పార్టీ నాయుకులు వీరమహిళలు జనసైనికులు ఎంతోగాను కృషి చేశారు. రాబోయే ఎలక్షన్లో కచ్చితంగా పవన్ కళ్యాణ్ గారుని సీఎం గా చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా పోరాటాలు చెయ్యాలి. ఎలాంటి అధికారం లేకుండా పవన్ కళ్యాణ్ గారు సాధించిన విజయాలు ప్రజలులోకి తీసుకువెళ్ళాలి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గెడగాం గ్రామ జనసైనికులు యువత పెద్దలు పిల్లలు వీరఘట్టం మండలం నాయకులు అనంత్ శ్రీను బన్ని కార్తీక్ గణేష్ అనిల్ యోగి పాల్గొన్నారు.