జనసేన జనజాగృతి యాత్ర.. 32వ రోజు

  • రబ్బరు చెప్పులు వేసుకున్న వ్యక్తులను రాజకీయ నాయకులను చేస్తానన్న పవన్ అన్న మాట నెరవేరింది
  • జనసేన పార్టీ గెలుపుకు మొదటి అడుగే ఈ జన జాగృతి యాత్ర

రాజానగరం: జనసేన జనజాగృతి యాత్రలో భాగంగా ఇంటింటికి జనసేన కార్యక్రమం రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరిచర్ల విజయ్ శంకర్ అధ్యక్షతన సీతానగరం మండలం, చీపురుపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ గాజు గ్లాసు & షణ్ముఖ వ్యూహం కరపత్రలు ప్రతి ఇంటికి ఇవ్వడం జరిగింది. ప్రతి ఊరు, ప్రతి వీధి, ప్రతి ఇళ్లు, ప్రతి మనిషి లో మార్పు రావాలని ఈ జన జాగృతి యత్ర ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, సీతానగరం మండలం ప్రధాన కార్యదర్శి & దళిత నాయకులు చిడిపి నాగేష్, శ్రీను సానపల్లి, రఘు, తాతరావు కొండేపూడి ప్రెసిడెంట్ వెల్లూరి సంతోష్ కుమార్ మరియు చీపురుపల్లి గ్రామ జనసేన పార్టీ కె రాజకుమార్, నవీన్, ప్రసాద్, గాజుమోగ్గల పెద్ద నవీన్ కుమార్ జనసైనికులు జనసేన పార్టీ సానుభూతిపరులు పాల్గొన్నారు.