పాలకొండ జనసేన కార్యాలయ ప్రారంభాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన జాని

పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ 24.08.2022 బుధవారం ఉదయం 8:30 నిమషాలకి పాలకొండ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభం అవుతున్న సందర్బంగా… పాలకొండ శ్రీ కోట దుర్గా దేవి తల్లి దర్శనం చేసుకొని అక్కడ నుంచి బైక్ ర్యాలీతో పాలకొండ నియోజకవర్గ నాయుకులు గర్భాన సత్తిబాబు నాయకత్వం లో ఇతర నియోజకవర్గం ఇంచార్జ్ లు నాయకులు మరియు పాలకొండ నియోజకవర్గం నాయకులు, జనసైనికులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తీసుకోని జయప్రదం చేయవలిసినదిగా వీరఘట్టం మండల నాయుకులు జనసేన జానీ నియోజకవర్గ నాయుకులకి, జనసైనికులకి పిలుపునివ్వడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంతో పాటుగా జనసేన పార్టీని జనంలోకి తీసుకువెళ్లే బాధ్యత అందరిదిపైన ఉన్నదని జనంకోసం జనసేన, ప్రజలు కోసం పవన్ కళ్యాణ్ అని జనసేన జానీ చెప్పడం జరిగింది.