బోనకల్ రైల్వేస్టేషన్లో శాతవాహన ఇంటర్సిటీ ఆపాలని జనసేన డిమాండ్

  • బోనకల్ రైల్వే స్టేషన్ మాస్టర్ కి వినతిపత్రం అందించిన బోనకల్ జనసేన పార్టీ మండల కమిటీ

బోనకల్, జనసేన పార్టీ బోనకల్ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ ముఖ్య నాయకులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇంచార్జ్ రాము ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక అధ్యక్షులు దుంపటి శ్రీనివాసరావు రాష్ట్ర నాయకులు సూచనలు సలహాలతో జిల్లా నాయకులు సూచించిన సలహాలతో బోనకల్ రైల్వే స్టేషన్లో శాతవాహన ఇంటర్సిటీ స్టేషన్లో ఆగితే బోనకల్ పరిసప్రాంతాలు పక్కన చింతకాని మండలం పక్కన తెలంగాణ సరిహద్దులు ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతమైన వత్సవాయి మండలం ఇటు వైరా మండలం గల జనాభా రైల్వే మార్గమైనటువంటి దూర ప్రాంతాలకు హైదరాబాద్ వరంగల్ కాజీపేట్ ప్రతినిత్యం ప్రజల సమస్యల మీద దూర ప్రాంతం వెళ్లడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కావున ఈ నాలుగు మండలాల పరిధిలో ఉన్నటువంటి జనాభా బోనకల్ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు స్టేషన్లో స్టాప్ పెడితే ఈ నాలుగు మండలాల ప్రజల సమస్యలు తీర్చగలరని బోనకల్ రైల్వే స్టేషన్ మాస్టర్ కి జనసేన పార్టీ మండల కమిటీ తరఫున వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటు అదేవిధంగా ఈ సమస్యపైన పై అధికారులు తీసుకెళ్లి ప్రజల సమస్యల మీద పోరాడుతామని ప్రజల సమస్యల పైన ఎప్పుడు జనసేన ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సహాయ కార్యదర్శి షేక్ బాజి బాబా తదితరులు పాల్గొన్నారు.