డాక్టర్ శ్రీధర్ పిల్లా చేతుల మీదగా జనసేన కార్తిక సమారాధన పోస్టర్ విడుదల

పిఠాపురం, కుల మతాలకు అతీతంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా నిర్వహించబోయే జనసేన కార్తిక వనసమారాధన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పోస్టల్ విడుదల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా పోస్టల్ విడుదల చేసి అనంతరం డాక్టర్ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలోని జనసైనికులు అందరూ కలిసి ఒకే కుటుంబంల కలిసిమెలిసి పనిచేస్తామని ఏ ఒక్కరూ వేరువేరు కాదని పిఠాపురం జనసైనికులు అందరూ ఒకే వేదికగా కలిసిమెలిసి పని చేస్తూ పిఠాపురం నియోజకవర్గంలోనే తొలిసారిగా కులమతాలకు అతీతంగా కుటుంబ పరంగా అందర్నీ ఆహ్వానిస్తూ 13 -11-2022 ఆదివారం జరగబోవు జనసేన కార్తిక వన సమారాధన కార్యక్రమానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నామని డాక్టర్ శ్రీధర్ పిల్లా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, చెల్లుబోయిన సతీష్, పల్నాటి మధు, వలపుల చక్రధర్ రావు, మైనబత్తుల చిన్న, పెద్దింటి శివ, గంజి గోవిందరాజు, బత్తిన వీరబాబు, జల్లూరు చక్రి, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు, వాకపల్లి సూర్య ప్రకాష్ మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.