టిడ్కో ఇళ్లు, జగన్ కాలనీల నిర్మాణంపై చర్చకు సిద్దమా…?

  • సవాల్ విసిరిన గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె, పేదలకు ఇళ్ల ఇవ్వకుండా మోసం చేశారని దీనిపై మదనపల్లె ఎమ్మెల్యే, మంత్రి, ఎంపి, ప్రజాప్రతినిధులు చర్చలకు సిద్దమా అని జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి సవాలు విసిరారు.‌ జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు హ్యాష్ ట్యాగ్ అనే నినాదంతో ఉద్యమాన్ని చేపడతామని శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అ‌ని, నవరత్నాలలో ఒక్కటి కూడా నెరవేర్చకపోయారని విమర్శించారు. జగనన్న కాలనీలలో 25 లక్షల ఇళ్లను అందిస్తామన్న హామీ ఏమైందని, దీనిపై అంబేద్కర్ సర్కిల్ వద్ద చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ‌జగన్ అండ్ కో ఇచ్చిన మాట ఏమైంది, రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన భూములు ఏమయ్యాయని తెల్చడానికి పార్టీ పిలుపు మేరకు ఈనెల 12, 13, 14 వ తేదీలలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రదాన కార్యదర్శి జంగాల శివరామ్ రాయల్ మాట్లాడుతూ భూముల సేకరణ సమయంలో యజమానులకు ఇవాల్సిన నష్టపరిహారం ఏమయ్యాయని ప్రశ్నించారు. ‌జగనన్న కాలనీలో రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు ఏమి లేవన్నారు.‌ పార్టీ పిలుపు మేరకు 12, 13, 14 వ తేదీలలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.‌ అక్కడ కుటుంబాలు నివసించే విధంగా సౌకర్యాలు లేవని అన్నారు.‌ ఇచ్చిన హామీ విధంగా 28 లక్షల ఇళ్లు ఏమయ్యాయి వైసిపి పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగనన్న ఇల్లు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్లి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామని వివరించారు. ఈ సమావేశంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి శివరామ్ రాయల్, రాష్ట్ర చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా లీగల్ సెల్ అమరనారాయణ, మదనపల్లె రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్‌ బాబు, ప్రధాన కార్యదర్శి నాగరాజు, వీర మహిళలు రెడ్డమ్మ, టైగర్ పద్మావతి, కోలా నాగవేణి, పసుపులేటి రేణుక పాల్గొన్నారు.