వైసీపీ ప్రభుత్వంపై.. జగన్మోహన్ రెడ్డి పరిపాలనపై తీవ్రంగా మండిపడిన జయరాం రెడ్డి

  • అనంతపురం సత్యసాయి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి

అనంతపురం సత్యసాయి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పశువుల్ని మెప్పించే పరిపాలన అందించగలడు గాని… ప్రజలు మెచ్చే పాలన ఇవ్వలేడు అని కోనసీమ జిల్లా వరద ముంపు ప్రాంత పర్యటన ద్వారా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఉపాధ్యాయుల పైన దురుద్దేశంతో చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగులకు చేతకాని హామీలు ఇచ్చి, నెరవేర్చలేక ప్రభుత్వ ఉద్యోగులను మరియు ముఖ్యంగా ఉపాధ్యాయులను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని దురుద్దేశంతో…. అవినీతి యాప్ రూపొందించి 14400 కాల్ సెంటర్ పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజకీయ నాయకులు అవినీతి చేస్తే ఏ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలి?

ప్రభుత్వ స్కూల్లకు బుక్కులు సప్లై చేయలేక, ప్రభుత్వం హామీ ఇచ్చిన కిట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చలేక, ప్రతి జిల్లాలో డి.ఈ.ఓల ద్వారా హెడ్మాస్టర్లకు వీడియో కాల్ చేయించి ఎవరైనా అడిగితే బుక్కులన్నీ సప్లై చేసినం, కిట్లన్నీ ఇచ్చినామని చెప్పాలి లేకపోతే మీ మీద చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారు. ఈ విషయాలు ఉపాధ్యాయులు బయటబెడతారని దురుద్దేశంతో ఈ రోజు ఉపాధ్యాయుల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ఉపాధ్యాయుల్ని ప్రజల్లో చులకన చేసే దురుద్దేశంతో ప్రకటనలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ జిల్లాల్లో వరద ముంపు ప్రాంతంలో పర్యటన సీఎం మా ప్రాంతానికి వస్తే ఎంతో కొంత మంచి జరుగుతుందని ఆశించిన ముంపు ప్రాంత ప్రజల ఆశలు నీరు కార్చారు. డ్రామా కంపెనీని తలదన్నే విధంగా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని చేస్తున్న పర్యటన హాస్యాస్పదంగా ఉంది.

సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బురదలో తిరుగుతున్నారంట? వరద ముంపు ప్రాంతంలో బురద కాక ఏముంటుంది? కేవలం పబ్లిసిటీ ప్రకటనలు తప్ప వరద ముంపు ప్రాంత ప్రజలకు ఈ పర్యటన ద్వారా ప్రయోజనం చేకూరలేదు. ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైందని స్పష్టంగా అర్థమైంది. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.