ఉదారగుణం చాటుకున్న జనసేన నేత బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, చల్లగుండ్ల గ్రామంలో ఆదివారం చల్లగుండ్ల గ్రామంలో నూతన జనసేన జెండా ఆవిష్కరణలో భాగంగా ఇంటింటికి పవన ప్రజా బాట అనే కార్యక్రమం చేస్తూ ఉండగా ఒక నిరుపేద వృద్ధుడికి కనీసం ఇల్లు లేకపోవడం సరైన వసతులు లేకపోవడం చూసి చలించి వెంటనే ఆవృద్ధునికి సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు బొర్రా వెంకట అప్పారావు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి తన మంచితనాన్ని చాటుకున్నారు. అక్కడ ఉన్న గ్రామ జనసైనికులకి ఇచ్చి వారికి చేతుల మీదగా ఆ వృద్ధునికి అందించటం జరిగింది. జనసేన పార్టీ ఏప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాదె సాంబశివరావు, యర్రంశెట్టి రమేష్, గాదే భద్రయ్య, రాసంశెట్టి నరసింహారావు, శీలం శంకర్, దండే రమణ, మిద్దేం రామస్వామి గ్రామస్తులు పాల్గొన్నారు.