జనసేనపార్టీ ఉచిత వాటర్ ట్యాంకర్

రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు నాగిరెడ్డి తారకప్రభు పుట్టినరోజు సందర్బంగా తారకప్రభు ఫ్రెండ్స్ సర్కిల్ వారు ట్రాక్టర్ డీజల్ మరియు డ్రైవర్ జీతం ధన సహయంతో జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ ద్వారా మంగళవారం అంతర్వేది, అంతర్వేది దారికోడప ప్రాంతం మరియు సఖినేటిపల్లి స్టీమర్ రేవు ప్రాంత ప్రజలు త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్న వారికి జనసేనపార్టీ ఆద్వర్యంలో ఉచిత త్రాగునీరు సరఫరా చేయడం జరిగిందని రాజోలు జనసేననాయకులు మరియు జనసేనపార్టీ చిరు పవన్ సేవాసమితి ఉచిత వాటర్ ట్యాంకర్ వ్యవస్థాపకులు నామన నాగభూషణం తెలిపారు.