ప్రభుత్వ పనితీరుపై మండిపడ్డ జనసేన నేతలు

తిరుపతి, జనసేన-టిడిపి-బీజీపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ గురువారం మీడియా సమావేశం నిర్వహించడంజరిగింది. టిడిపి నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాడులను ఖండిస్తున్నామని. బాలసుబ్రహ్మణ్యం ఇంటిపై దాడులు వెనుక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిల హస్తం ఉందని, కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డిలకు ఓటమి భయం పట్టుకుందని, కరుణాకర్ రెడ్డి ఓటమి భయం తో కూటమి నేతలను దాడులు పేరుతో బెడిరించలని చూస్తే ఎవరూ భయపడరు, టిడిపి యువ నాయకులు లోకేష్ కాన్వాయ్ లో పోలీసులు తనిఖీకి చేశారని, టిడిపి నేతల కాన్వాయ్, ఇళ్లపై దాడుల్లో ఒక్క రూపాయి అయినా సీజ్ చేశారా? రేణిగుంట గోడౌన్ లలో దొరికిన వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సామగ్రిని సీజ్ చేయడంలో అధికారుల తీరు దారుణం అని, పోలీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని, విధులు మరిచి ప్రవర్తించిన అధికారులు ఇప్పటికే కొంతమంది సస్పెండ్ అయ్యారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా కొంత మంది పోలీసుల తీరు మారలేదని, ఎమ్మెల్యే భూమనకు తొత్తులుగా వ్యవహరించే అధికార్లు ఇబ్బంది పడతారని, ప్రజలు తిరుపతిలోనే కాదు రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సాగనంపడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు.