కర్రి వెంకటరమణ కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నేతలు

గాజువాక: శ్రీ కృష్ణ దేవరాయ కాపు సంక్షేమ భరోసా కేంద్రాల వ్యవస్థాపకుడు, జనసేన పార్టీ నాయకులు కర్రి వెంకటరమణ పెద్ద కుమారుడు గత మూడు రోజుల క్రితం అచ్యుతాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. బుధవారం ఆ కుటుంబాన్ని గాజువాక కాపు సంక్షేమ సేన సభ్యులు మరియు జనసేన పార్టీ గాజువాక నాయకులు గుంటూరు మూర్తి, రౌతు గోవింద్, దుర్గ, కళావతి, రామలక్ష్మి, పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.