నేతాజీ పోరాటస్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సాధిస్తాం: చెన్నారెడ్డి మనుక్రాంత్

  • నెల్లూరు జనసేన ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు ఘన నివాళులు

నెల్లూరు: నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 126 వ జయంతి సందర్బంగా మినీ బైపాస్ లో ఉన్న నేతాజీ విగ్రహానికి జనసేన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ శ్రేణులు మరియు యాన్ సీసీ క్యాడ్డెడ్ తో కలిసి నివాళులు అర్పించటం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారి జయంతి సందర్బంగా అయన జనసేన పార్టీ తరుపున నివాళులు అర్పించాం. అయన పోరాటస్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సాధిస్తాం అని నేతాజీ సుభాష్ చంద్ర అస్తికలను భారతదేశానికి తీసుకోని రావాలి అని ప్రభుత్వాలని కోరుకుంటున్నాము అన్నారు. నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు మాట్లాడుతూ తెల్లదొరల మీద సాయుధ దళాలతో పోరాడిన వీరుడికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరుపున ఘనమైన నివాళులు ఎన్.సీ.సీ కాడెడ్ కలిసి నివాళులు అర్పించాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిలు కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధి కలువాయి సుధీర్, నగర కార్యదర్సులు శ్రీధర్, జీవన్, శేఖర్ మరియు జనసేన పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.