రైతుల అభివృద్ధి, సంక్షేమమే జనసేనపార్టీ లక్ష్యం: పెండ్యాల శ్రీలత

నార్పల: రైతుల అభివృద్ధి, సంక్షేమమే జనసేనపార్టీ లక్ష్యమని జనసేన పార్టీ మహిళావిభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత పేర్కొన్నారు. జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆ పార్టీ రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పెండ్యాల శ్రీలత ఆధ్వర్యంలో అంతర్జాతీయ రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ మేరకు వారు మండల పరిధిలోని గంగనపల్లి గ్రామంలో రైతులతో మమేకమై పంట పొలాలను సందర్శించి వ్యవసాయం గురించి రైతులతో చర్చించారు. ఈ సందర్బంగా పెండ్యాల శ్రీలత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్షంలోని ఉన్నప్పుడు రైతుల కోసం అనేక హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చాక రైతుల విస్మరించారన్నారు. రాష్ట్రంలోని రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడున్నర సంవత్సరాలు గడుస్తున్నా రైతులకు ఒక్క డ్రిప్ పైపు కూడా అందివ్వలేదని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర లేక రైతులు పెట్టుబడులకు తెచ్చిన అప్పులు కట్టలేని స్థితిలో అనేక మంది రైతుల ఆత్మహత్యలు చేసుకుని తమ కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని అన్నారు. అలాంటి రైతు కుటుంబాలకు అండగా నిలబడుతూ కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తూ వారి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రను ఉద్యమంలా ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. రైతు రాజ్యం రావాలంటే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పద్మావతి, జిల్లా కార్యదర్శి సంజీవరాయుడు, నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి, శింగనమల నియోజకవర్గ నాయకులు కొండిశెట్టి ప్రవీణ్ కుమార్, గుమ్మడిసాని శిల్ప, కలవాయి విశ్వనాథ రెడ్డి, గురుప్రసాద్, చంద్రమోహన్, కళ్యాణ్, నాగేష్, కృష్ణ, రైతులు రాజు, చలపతి, కొండయ్య, సన్నీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.