ముంపు తప్పదని జనసేన ముందే చెప్పింది!

  • చెరువులు, గెడ్డలు, మురుగు కాలువల్లో కబ్జాలు తొలగించి మురుగుతీత పనులు చేపట్టకపోతే వర్షాకాలంలో ముంపు తప్పదని చెరువులు
  • జిల్లా కలెక్టర్ స్పందనలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదు
  • బైపాస్ కాలనీలోని నెంబర్ టు హాస్టల్ పరిస్థితి దయనీయం
  • ముంపు ప్రాంతాల్లో రోగాలు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టి వైద్య శిబిరాలు నిర్వహించాలి

పార్వతీపురం నియోజకవర్గం: ముంపు ప్రాంతాల్లో పర్యటించి రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిలో చేపలు పట్టి నిరసన తెలియజేసిన జనసేన, టీడీపీ నాయకులు వర్షాకాలంలో ముంపు ముప్పు తప్పదని జనసేన ముందే చెప్పిందని ఆ పార్టీ నాయకులు అన్నారు. వరద నీరు ప్రవహించే చెరువులు, వరహాల గెడ్డ, మురుగు కాలువల్లో కబ్జాలు తొలగించి వేసవిలోనే మురుగు తీత పనులు చేపడితే వర్షాకాలంలో ముంపు ముప్పు ఉండదని జనసేన పార్టీ ముందే చెప్పినట్లు ఆ పార్టీ నాయకులు అన్నారు. గురువారం ముంపుకు గురైన పార్వతీపురం పట్టణంలోని సౌందర్య సినిమా హాలు ప్రాంతం, వెనుకనున్న కృష్ణ కాలనీ, బైపాస్ కాలనీ, జనశక్తి కాలనీ తదితర ప్రాంతాలను జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, తామరఖండి తేజ, టిడిపి ఇంచార్జ్ బోనెల విజయ చంద్ర, పోల సత్యన్నారాయణ, బోను చంటి, కోల మధు తదితరులు చెరువును తలపించే రోడ్డుపై ప్రవహిస్తున్న వరదనీటిలో గెలాలు వేసి చేపలు పట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన, టీడీపీ నాయకులు మాట్లాడుతూ కాలువల్లో మురుగు తీత పనులను తాము అడిగిన వెంటనే చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కబ్జాలు తొలగించాలని, ముంపు కుగురవుతున్న మెయిన్ రోడ్డు ను రక్షించాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతలు సమర్పించడం జరిగిందన్నారు కానీ ఫలితం లేదన్నారు. అందుకే ఈ దుస్థితి అన్నారు. పార్వతీపురం జిల్లాకు కేంద్రమైనప్పటికీ ఐఏఎస్, ఐపీఎస్ తదితర అధికారులు వచ్చినప్పటికీ సమస్యలు మాత్రం తీరటం లేదన్నారు. గత రెండు రోజులుగా ఆయా ప్రాంతాలు ముంపుకు గురి కావడంతో ప్రజల జీవనం అస్తవ్యస్తమైందన్నారు. వేసవిలో ఆయా పనులు చేపట్టి ఉంటే ఇప్పుడు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. వరద నీటిని పంపించేందుకు ప్రకృతి ప్రసాదమైన వరహాలు గెడ్డ ఉందన్నారు అయినప్పటికీ దాన్ని వినియోగించడం లేదన్నారు మున్సిపాలిటీలో అసలు పాలన సాగటం లేదని ఆరోపించారు. బైపాస్ కాలనీలోని నెంబర్ టు హాస్టల్ విద్యార్థుల పరిస్థితి దయనీయమన్నారు. తలనొప్పితో బాధపడుతున్న విద్యార్థిని పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు .అలాగే జనశక్తి కాలనీ, రాజీవ్ గృహకల్ప లో నివాసం ఉంటున్న ప్రజలకు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా సంబంధిత పాలకులు, అధికారులు స్పందించి పార్వతీపురం పట్టణం బాగు కోసం కృషి చేయాలన్నారు. నీట మునిగిన ప్రాంతాల బాధితులకు పునరావాసంతో పాటు నిత్యవసర సరుకులు అందజేయాలని కోరారు. వరద ప్రాంతాల్లో రోగాలు ప్రబలకుండా పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసైనికులు, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.