నూజివీడు సమస్యలపై ఏలూరు జిల్లా కలెక్టర్ కి జనసేన వినతిపత్రం

నూజివీడు, టౌన్, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారించాలని కోరుతూ సోమవారం జరిగిన స్పందనలో ఏలూరు జిల్లా కలెక్టర్ కి జనసేన పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. మండలంలోని వెంకటాయపాలెంలో టేకు చెట్లు నరికిన దొంగల్ని పట్టుకోవాలని, అన్ని సౌకర్యాలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని, టిట్కో ఇళ్ళు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలనీ, జగనన్న ఇళ్ళు లబ్ధిదారులకి స్థలాలు కేటాయించిన వాటిలో సౌకర్యాలు కల్పించలని, నూజివీడులో ఉన్న 7500 ఏకరాలకి ఈనాం భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని, పాత రావిచర్ల సరిహద్దు సమస్య పరిష్కారం చేయాలని, ఎంఎన్ పాలెం పల్లెర్లమూడి రోడ్డు పోయాలని, ముసునూరు మండలంలో ఇసుక అక్రమ రవాణ కి అడ్డుకట్ట వేయాలని, జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, జగనన్న ఇల్లు స్థలాల కుంభకోణంపై విచారణ చేపట్టాలని, ఎమ్మెల్యే పిఎ అర్హత లేకుండా చేస్తున్న ఉద్యోగాలపై విచారణ చేయాలని, ఆగిరిపల్లిలో రోడ్లు వెంటనే పూర్తి చేయాలని, నూజివీడు టూ విజయవాడ రోడ్డు వెంటనే వేయాలని, చాట్రాయి మండలం ఫ్లోరైడ్ గ్రామాల్లో తమ్మిలేరు ద్వారా మంచినీరు అందించాలని, చింతలపూడి ఎత్తిపోతల పథకం పేజ్ -2 పనులు పూర్తి చేసి సాగునీరు రైతులకు అందించాలని, సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని కోరుతూ జనసేన పార్టీ ప్రతినిధి బృందం ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కి అన్ని సమస్యల పై వేరు వేరు గా వినతి పత్రలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంక్షేమ సేన సంఘం నూజివీడు అధ్యక్షులు ఏనుగుల వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ, నూజివీడు మండలం అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము, టౌన్ నాయకులు ముత్యాల కామేష్, ఏనుగుల చక్రీ, ఎం సునీల్ కుమార్, వీర మహిళలు నిట్ల ఉమామహేశ్వరి, జక్కుల లక్ష్మి, ముసునూరు మండలం ప్రధాన కార్యదర్శి చలపాటి ప్రేమ చంద్, నూజివీడు మండలం వైస్ ప్రెసిడెంట్ ఇంటురి చంటి, ప్రధాన కార్యదర్శి చెరుకుపల్లి కిషోర్, ప్రథాన కార్యదర్శి లంకే సురేష్, అన్నవరం నాయకుడు అశోక్ తదితరులు పాల్గొన్నారు.