పెన్నా నదీ తీర ప్రాంత వాసులను కాపాడాలని జనసేన వినతి

నెల్లూరు సిటీ, ఈద్గామిట్ట వద్ద దశాబ్దాలుగా నది ఒడ్డున ప్రమాదకరమైన జీవితం జీవిస్తున్న ప్రజలకు హౌస్ ఫర్ ఆల్ కింద ఇల్లు ఇవ్వండి అంటూ సబ్ కలెక్టర్ కి స్పందనలో వినతిపత్రం అందజేసిన జనసేన నాయకులు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పాములు మాతో గుడిసెల్లో కాపురం చేస్తుంటాయని బాధలు పడుతున్నారు. దశాబ్దాలుగా వరదలు వస్తే పెట్టే బేడా సర్దుకుని పోయి మరలా వచ్చి అక్కడే బతకాల్సిన వారి జీవన ప్రమాణాలు మార్చండి. పెన్నా నది ఒడ్డున నివసించే పేదలకు వరదలు వచ్చినప్పుడు ప్రాణాలకు ఇప్పటి చేతిలో పెట్టుకొని పరిగెత్తాల్సిన పరిస్థితి ఉంది. హౌస్ ఫర్ ఆల్ కింద ఇస్తున్న ఇళ్లలో మొదటగా వీళ్ళకి ఇవ్వవలసిన అవసరత ఉంది. పలుసార్లు అప్లై చేసినా 200 మంది దాకా అప్లై చేస్తే దానిలో ఒక అయిదారు మందికి తప్ప, ఇచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యంగా పూరిగుడుసుల్లో నివసిస్తున్న వారు ఎండకి ఎండి వానకు తడిసి ఇబ్బందులు పడుతున్నారు. నదీ ప్రాంతాల నుంచి నాగుపాములు వచ్చి పిల్లలతో సావాసం చేస్తున్నాయి. దుర్బరంగా జీవిస్తున్న వీరికి భద్రత కల్పించాల్సిన మన నాయకులకు ఉంది. ఈ నిరుపేదలు ఓటు హక్కు కలిగి ఉన్నప్పుడు వీరందరికీ నివాస ఇల్లు ఎందుకు ఇవ్వరు. గత ప్రభుత్వాలు కట్టి ఉన్నప్పుడు ఇళ్ళు ఇంకా ఎవరికీ ఇచ్చినట్లు లేవు. గెలిచిన వైసిపి ఎమ్మెల్యేలు కొత్త ఇల్లు కట్టుకుని ఫాన్సీగా బతుకుతుంటే,ఈ పేదల కష్టాలు పడుతూ ఎందుకు జీవిస్తున్నారు. మాట ఇచ్చిన వైసిపి ప్రభుత్వం నిలబెట్టుకునే దాంట్లో విఫలమైంది.ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అనేకమార్లు ఇబ్బందుల్లో ఉన్న ప్రజల తరఫున అనేకసార్లు నిలబడ్డారు. ఈసారి ప్రజా ప్రభుత్వానికి అవకాశం వలసిందిగా ప్రజలందరినీ పిలుపునిస్తున్నాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, రాష్ట్ర పీఏసీ నెంబర్ మనోహర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేంద్రబాబు, వేములపాటి అజయ్ నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాట అయిన తర్వాత వీరందరికీ ఇళ్ళు ఇప్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు జనసేన సీనియర్ నాయకులు ఏటూరి రవి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహన్, శరవణ, మౌనేష్, హేమచంద్ర యాదవ్, కేశవ, శరవణ, బన్నీ, ఖలీల్, వర, ఇషాఖ్ తదితరులు పాల్గొన్నారు.