కొడవటిపూడి గ్రామసభలో అధికారులను ప్రశ్నించిన జనసేన

పాయకరావుపేట నియోజకవర్గం, కోటవురట్ల మండలం, కొడవటిపూడి గ్రామంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ నాయుకులు బాలేపల్లి ఏసుబాబు వారి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ అధికారులను ప్రజాప్రతినిధులను ప్రశ్నించడం జరిగింది. కొడవటిపూడి గ్రామంలో అభివృద్ధి లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొడవటిపూడి శివారి గ్రామమైన కోదండరామపురానికి రోడ్డు ఎందుకు ఆగిపోయింది. ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ఎందుకు పట్టించుకోవట్లేదు. అదేవిధంగా కొత్తమ్మ తల్లి గుడి దగ్గర నుండి స్కూల్ వరకు డ్రైనేజి ఎందుకు అవ్వలేదు. దీనివల్ల ఆర్ అండ్ బి రోడ్డు గుంతలు ఏర్పడి ప్రజలు చాలా ఇబ్బందిపడుతూ యాక్సిడెంట్ లకు గురవుతున్నారు. మరియు శ్రీ నూకాంబిక గుడి వద్ద పారిశుద్ధ్యంతో రోజురోజుకు చాలా దరిద్రంగా తయారవుతుంది. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. కొడవటిపూడి గ్రామ ప్రజలు అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ సమస్యలను ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళతారని కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు సహకరించారని వారందరికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.