అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ అరెస్ట్ దుర్మార్గం

  • అవనిగడ్డ జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్

కృష్ణా జిల్లా, అవనిగడ్డ నియోజకవర్గం: అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ను అరెస్ట్ చేయటం దుర్మార్గం అని అవనిగడ్డ జనసేన పార్టీ కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ పేర్కొన్నారు. సోమవారం వేణుగోపాల్ మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ ను, పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించటం చాలా బాధాకరం. భారత దేశంలోని బాల బాలికలకు, గర్బవతులకు (ముఖ్యంగా పేద వారి పిల్లలకు, పేద మహిళలకు) పుష్టికరమైన ఆహారము (సంపూర్ణ ఆహారము) అందటంలేదని, వారికి పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వము, ఆంగన్వాడీ కేంద్రాల వ్యవస్థను ప్రవేశ పెట్టింది. ఆంగన్‌వాడీ కేంద్రం సిబ్బందికి, కేంద్ర ప్రభుత్వం కొంత వాటా, రాష్ట్రప్రభుత్వం కొంత వాటా కలిపి, జీతంగా ఇస్తాయి. భారతదేశం లాంటి అత్యధిక జనాభా గలిగిన దేశాల్లో వైద్య సదుపాయాలు అందరికీ అందని తరుణంలో చిన్న పిల్లల మరణాలు ఎక్కువగా ఉంటాయి. శిశు మరణాలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వము మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా అంగన్వాడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది. అంగన్వాడి సిబ్బంది చిన్న పిల్లలకు అందించే సేవలు వెలకట్టలేనివి. అంగన్వాడి కేంద్రానికి వచ్చే పిల్లలను తమ కన్నబిడ్డల్లా చూసుకుంటూ వారికి పౌష్టిక ఆహారం అందించడంలో అంగన్వాడీ సిబ్బంది ముఖ్య పాత్ర పోసిస్తున్నారు. గత ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లకు 10,500 గౌరవ వేతనం ఉండేది. వైసిపి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు నిండుతున్నప్పటికీ కేవలం వారికి పెరిగిన జీతం 1000 రూపాయలు మాత్రమే. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు ఉండవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డిగారు అంగన్వాడీ టీచర్లకు జీతాలు పెంచుతామని వారి సమస్యలను పరిష్కరిస్తామని అనేక హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టినాక అంగన్వాడీ టీచర్లను పూర్తిగా విస్మరించారు. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బంది తమకు జీతాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా తమ స్కేల్ ను కూడా క్రమ బద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించవలసిన వైసిపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, ఎక్కడకక్కడే అంగన్వాడీ సిబ్బంది నిరసనలను అణిచివేత ధోరణితో వ్యవహరిస్తుంది. అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి తమ సమస్యలు పరిష్కరించే వరకు విధులకు హాజరు కాముని భీష్మించి కూర్చున్న అంగన్వాడి సిబ్బందిని పిలిచి మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించకుండా వైసిపి ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తూ, సచివాలయ సిబ్బందితో వాలంటీర్లతో బలవంతంగా అంగన్వాడీ కేంద్రాలను తెరిచే ప్రయత్నం సరైంది కాదు. ప్రస్తుతం ఉన్నవారిని తొలిగించి 26 వ తేదీనుండి క్రొత్త వారిని నియమిస్తాము అనే ప్రభుత్వం నిర్ణయం సరి అయింది కాదు. అంగన్వాడి సిబ్బందికి జనసేన పార్టీ పూర్తి మద్దతు ఉంటుంది. ప్రభుత్వాధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే అంగన్వాడీ సిబ్బంది సమస్యలను పరిష్కరించండి. లేని పక్షాన అంగన్వాడీ సమస్యలపై జనసేన పార్టీ అధినాయకత్వంతో చర్చించి తగు కార్యాచరణ రూపొందిస్తాం. అరెస్టు చేసిన అంగన్వాడి సిబ్బందిని వెంటనే విడుదల చేయాలి అనీ జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము.