19 వ డివిజన్లో ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరు నగరపాలక సంస్థలోని 19వ డివిజన్ లో జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ రెడ్డి అప్పలనాయుడు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రలో భాగంగా కొత్తూరులోని ఇందిరమ్మ కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ డివిజన్లలో ప్రజలు చాలా తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, ప్రధానంగా డ్రైనేజీ సమస్య రోడ్డు సమస్య, మంచినీటి సౌకర్యం లేదు, ఇక్కడ ఎటువంటి సదుపాయాలు లేవు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2009, 10లో ఈ కాలనీ ఏర్పాటు చేశారు. ఇప్పటికీ 13 సంవత్సరాల అయినప్పటికీ ఏ విధమైనటువంటి మౌళిక వసతులు లేవని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికీ కావాలని పెన్షన్లను తీసివేస్తీన్నారు. కరెంట్ చార్జీలు ఇంటి పన్నులు అధికంగా వస్తున్నాయని కట్టలేని పరిస్థితిలో ఉన్నామని స్థానికులు వాబోతున్నారు. ఇల్లు లేని పేదవాళ్లు చాలామంది ఉన్నారు. కనీసం మాకు ఇళ్ల స్థలాలు లేవని ఇచ్చిన వాళ్ళ దగ్గర నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. కానీ ఇప్పటికైనా నిద్రలేచి ఉన్నటువంటి సమస్యల మీద పరిష్కార మార్గాలు చూపాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. చాలామంది ఇక్కడ టిడ్కో ఇళ్ళకు డబ్బులు కట్టారని ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు ఐనప్పటికీ ఆ టిడ్కో ఇళ్ళను ఇవ్వలేదని పేద ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 2017 లోనే ఈ కాలనీలో అంగన్వాడి సెంటర్ కావాలని తీర్మానం చేసిన ఈరోజుకి అంగన్వాడి సెంటర్ నిర్మాణం చేయలేకపోయారని సిగ్గులేని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కనీసం కళ్ళు తెరిచి ఈ సమస్యకు పరిష్కారం చూపవలసిందిగా ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శి కుర్మా సరళ, కందుకూరి ఈశ్వరరావు, స్థానిక నాయకులు ఎమ్.రవి, సోంబాబు, ములికి శ్రీను, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, బోండా రాము నాయుడు, వంశీ, రండీ దుర్గా ప్రసాద్, బుధ్ధా నాగేశ్వరరావు, రాపర్తి సూర్యనారాయణ, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.