నాదెండ్ల మాట కాకినాడలో అందరి నోట

కాకినాడ సిటీ: జనసేన పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట అనే కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక జగన్నాధపురం 24 డివిజన్లో జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే కృష్ణ ఆధ్వర్యంలోను, 37వ డివిజన్ రామాలయం సెంటర్ ప్రాంతంలో బలసాడి శ్రీను ఆధ్వర్యంలోను జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా తెలివైన వారనీ ఎంత తెలివైన వారంటే క్రీడలని ప్రోత్సహించరు వాటి మౌలికవసతులని అభివృద్ధి చేయరు కానీ క్రీడాకారులని ఆడుదాం ఆంధ్రాలో ఆడమంటారనీ ఎందుకంటే దీనిలో పేద్ద ఖర్చు ఉండదుగా దానాదీనా ఆపని ఈపని అనిచెప్పి ఖర్చు చూపించి ఆ సొమ్ముని జేబులో మళ్ళించుకోవచ్చన్నది ఉద్దేశమేమో తెలియదన్నారు. లోగడ చేతిలో తైలం పడనిదే పని జరగదని చెప్పే దృశ్యాలు గుర్తుకువస్తున్నాయని ఎద్దేవా చేసారు. ఏపధకాన్ని పోస్టుమార్టం చేసినా అందులో అవినీతి బయటపడుతోందన్నది ప్రజలకు అర్ధమవుతోందనీ, ఇలాంటి వ్యక్తినా మన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది అని నేడు ప్రజలు చింతించే పరిస్థితికి రావడం ఒక వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యమన్నారు. తొందరలో ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని ఇంటికి పంపవలసినదిగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, 24వ డివిజన్ అధ్యక్షులు బండి అజయ్, సిటీ నాయకులు ఆకుల శ్రీనివాసు, వరద దొరబాబు, వరిపల్లి ప్రసాద్, చోడిపల్లి సత్యవతి, దారపు శిరీష, గంపల ప్రసాద్, వెంపల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.