రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేన టీడీపీ పొత్తు

పుంగనూరు నియోజకవర్గం: జనసేన సీనియర్ నాయకులు శ్రీనివాసులు శుక్రవారం విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ పుంగనూరు టౌన్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నా రాయల్ ఆధ్వర్యంలో గురువారం మా అధినాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం దృష్టిలో ఉంచుకొని జనసేన, తెలుగుదేశం పార్టీ కలయికతో రానున్న రోజుల్లో రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో రెండు పార్టీలు కలిసి ముందుకెళ్లడానికి నిర్ణయించారు. మా నాయకుడు నిర్ణయం మేరకు ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీతో కలిసి పుంగనూరులో జరుగుతున్న దౌర్జన్యాలు, భూ కబ్జాలు, అరాచకాలు సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయం మేరకు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చెప్పిన విధి, విధానాలను అనుసరిస్తూ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీతో మా పార్టీ శ్రేణులు కలిసి నడిచేందుకు సిద్ధం అని తెలియజేస్తున్నాం. ఇటీవల చంద్రబాబు పుంగనూరు పర్యటన నేపథ్యంలో జరిగిన గొడవలలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అమాయకులైనటువంటి ప్రజలను జైల్లో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాము, ఇకమీదట పుంగనూరులో ఎలాంటి కుట్రలు కేసులు దౌర్జన్యాలకు జనసేన పార్టీ సహించేది లేదని వైసిపి వారిని హెచ్చరిస్తున్నాము, కావున మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి పుంగనూరు జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందనీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాసులు, పాముల హరి, మణి, టిడిపి నాయకులు గంగరాజు మరియు తదితరులు పాల్గొన్నారు.