చెన్నంశెట్టిపల్లి హెల్పింగ్ హాండ్స్ ఎన్నారై కువైట్ ఆధ్వర్యంలో జనసేన-టిడిపి ఆత్మీయ సమావేశం

కువైట్, ఫర్వానియ ప్రాంతంలో ఉన్న నౌషాద్ రెస్టారెంట్ సభ ప్రాంగణముగా చెన్నం శెట్టిపల్లి హెల్పింగ్ హాండ్స్ ఎన్నారై కువైట్ అధ్యక్షులు జిగిలి ఓబులేసు గారి ఆధ్వర్యంలో ఘనంగా అతిరథ మహారధుల సమక్షంలో జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్లు కంచన శ్రీకాంత్, రామచంద్ర నాయక్, కువైట్ కన్వీనర్లు పగడాల అంజన్ కుమార్, ఆకుల రాజేష్, గల్ఫ్ జనసేన కువైట్ మీడియా ప్రతినిధి మర్రి రెడ్డి రాయల్, తెదేపా ఎన్నారై ఎంపవర్మెట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా కరోనా కష్ట కాలంలో ఎన్నో సేవలు అందించిన గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ కంచన శ్రీకాంత్ కి చెన్నంశెట్టిపల్లి హెల్పింగ్ హాండ్స్ వారు సేవారత్న విశిష్ట పురస్కార అవార్డుతో సత్కరించి,శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించిన గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ చెన్నంశెట్టిపల్లి హెల్పింగ్ హాండ్స్ ఎన్ఆర్ఐ కువైట్ వారు నా సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేయడం నాకు ఎంతో గర్వంగా ఉందని ఈ అవార్డు నా ఒక్కడిదే కాదని నాతో ప్రయాణించిన ప్రతి ఒక్కరదని తెలియజేసుకుంటున్నానని తెలిపారు. అంతేకాకుండా చెన్నం శెట్టిపల్లి వాసులు కువైట్ లో కొన్ని సంవత్సరాల నుండి ఊరు బాగుకోసం మేము సైతం అంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను చేయడం జరిగిందని అందులో భాగంగా పాఠశాల భవనం, అంగన్వాడి కేంద్ర భవనం, రోడ్డు ప్రమాద బారిన పడి ఆర్థిక పరిస్థితుల్లో ఇబ్బందిగా ఉన్న వారికి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సహాయ సేవా కార్యక్రమాలు చేశారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమి విజయకేతనం ఎగరేయాలని దానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గల్ఫ్ జాతీయ కన్వీనర్ రామచంద్రనాయక్ మాట్లాడుతూ ప్రేమే లక్ష్యం సేవే మార్గం అనే నినాదంతో సేవా కార్యక్రమాలను వారి గ్రామ అభివృద్ధి కోసం చేస్తూ రాజకీయ రంగంలో కూడా తమ ముద్ర ఉండాలని కోరుకుంటూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నీతి నిజాయితీగల పార్టీలకు సపోర్ట్ చేసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని అంతమొందించాలని కంకణం కట్టుకొని ఈరోజు జనసేన టిడిపి ఆత్మీయ సమావేశం నిర్వహించిన చెన్నం శెట్టిపల్లి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని, రానున్నది జనసేన టిడిపి ప్రభుత్వమని తిరిగి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని తెలియజేశారు. గల్ఫ్ కువైట్ జనసేన కన్వీనర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ కో హఠావ్, ఆంధ్రరాష్ట్రకు బచావో అనే నినాదంతో మనమంతా ముందుకు వెళ్లాలని ఈరోజు ఈ సమావేశంలో తీర్మానించిన విధంగా మనమంతా మన బంధుమిత్రులను మన యొక్క పార్టీల సిద్ధాంతాలను తెలియజేసి ఓటు బ్యాంకు మంచి విధంగా మనం ప్రయత్నించాలని గెలుపే ధ్యేయంగా అధికారమే లక్ష్యంగా పనిచేయాలని తెలియజేశారు. తెదేపా నేత కుదరవల్లి సుధాకర్ రావు మాట్లాడుతూ ఎన్నో సంక్లిష్ట సమస్యల మధ్య ఆంధ్ర రాష్ట్రం అటుడికి పోతుందని రాష్ట్రాన్ని రావణకాష్టంగా మలిచిన ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దించేంతవరకు మనం విశ్రమించకూడదని తెదేపా జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా మనమంతా పాటుపడాలని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా హెల్పింగ్ హాండ్స్ సభ్యులు ప్రతి ఒక్కరూ వారి వారి భావాలను ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య సభ్యులు జగిలి ఓబులేసు చెన్నంశెట్టి రాంబాబు, జగిలి రామాంజనేయలు, జగిలి రామకృష్ణ, చిన్నంశెట్టి అంజి, చెన్నంశెట్టి రామాంజనేయులు, చెన్నంశెట్టి హరిప్రసాద్, చెన్నంశెట్టి నాగరాజా, చెన్నంశెట్టి సుధాకర, సివి నాగరాజా, సి ఆదినారాయణ, దూదిమణి శ్రీను, దూదిమణి లక్ష్మీనారాయణ, గూటి రామ్మోహన, జగిలి బండయ్య, జగిలి రవి, జగిలి మోహన, జగిలి పెద్ద ఓబులేసు, ఈశ్వరయ్య, కాలే గురుప్రసాద్, కాలే గురునాధ, శ్రీకాంత్ రెడ్డిచెర్ల ఆంజనేయలు, ఆకుల అశోక్, సివి రమణ, ఈసు నాగేంద్ర, రమణ సుధాకర పురం శివయ్య రాచయ్య సుబ్బరాయుడు ప్రేమ్ రాయల్ బాల రాయల్ చలపతి రాజేష్ శంకర రెడ్డి రాయల్ హరీష్ బాషా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.