గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా అంబరాన్నంటిన జనసేనాని జన్మదిన సంబరాలు

గుంతకల్ నియోజకవర్గం: కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా గుంతకల్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో (పామిడి, గుత్తి, గుంతకల్) అనేక సేవా కార్యక్రమాలు చేసిన వీరమహిళలకు, జనసేన నాయకులకు, నిస్వార్థ జనసైనికులకు అనంత జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో వాసగిరి మణికంఠ పాల్గొన్నారు. వేడుకలలో భాగంగా పామిడి: జి.కొట్టాల గ్రామంలో మొదట అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్. వంక రాజు కాలవ గ్రామం ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు, పెన్సిల్, పెన్నుల పంపిణీ. కష్టాల్లో ఉన్న పామిడి మైనారిటీ జనసైనికుడికి ఆర్థిక చేయూత. గుత్తి: జనసేన పార్టీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు అన్నదాన కార్యక్రమం. నాయకుడికి అండగా #వన్ డే శాలరీ ఫర్ జనసేన మన పార్టీ – మన బాధ్యత. గుంతకల్: ఉదయం మస్తానయ్య తాత దర్గాలో ప్రత్యేక పూజలు మరియు అల్పాహారం పంపిణీ కార్యక్రమం. ఉదయం అనురాగ వృద్ధాశ్రమంలో అల్పాహార పంపిణీ. జనసేన పార్టీ ఆధ్వర్యంలో “మెగా రక్తదాన శిబిరం”. సాయంత్రం దివ్యాంగులకు నిత్యవసర సరుకులు పంపిణీ అనంతరం వారి సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం. సాయంత్రం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారికి 51 టెంకల సమర్పణ, కేక్ కటింగ్. కత్తుల వీధిలో పెద్ద ఎత్తున అల్పాహార పంపిణీ కార్యక్రమం. 6.12 వార్డ్ లో అన్నదాన కార్యక్రమం అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం. మహేంద్ర స్ట్రీట్ లో బాణాసంచా పేలుస్తూ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం. అంబేద్కర్ కాలనీలో భారీ కేక్ కటింగ్ కార్యక్రమం. ఇవే కాకుండా గుంతకల్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వచ్ఛందంగా అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ ప్రతి కార్యక్రమం జనసేన నాయకులు, నిస్వార్థ జనసైనికులు వారి సొంత కష్టంతో నిర్వహించడం ఎంతో అభినందినీయం.