అట్టడుగు వర్గాలవారిని రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేయాలన్నదే జనసేనాని ధ్యేయం: గాదె

  • అణగారిన వర్గాలకు ఆశాదీపంలా పవన్ కళ్యాణ్
  • రాజ్యాధికారంలో అట్టడుగు వర్గాలవారిని భాగస్వామ్యం చేయాలన్నదే పవన్ కళ్యాణ్ ద్యేయం
  • ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి పలుకుదాం
  • అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జనసేన ముందుకు సాగుతోంది
  • రెల్లి సంఘ ఆత్మీయ సదస్సులో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు, నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్

గుంటూరు: అట్టడుగు వర్గాలను రాజ్యాధికారంలో భాగస్వామ్యుల్ని చేయాలని అప్పుడే ఆ వర్గ ప్రజల జీవితాలు మెరుగుపడతాయన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అణగారిన వర్గాల ప్రజలకు ఆశాదీపంలా కనిపిస్తున్నాడని జిల్లా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. రెల్లి కులస్తులను అసెంబ్లీలోకి ఆహ్వానిస్తున్నాను అంటూ ప్రకటించిన పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలియచేస్తూ రాష్ట్ర రెల్లి యువత నాయకుడు సోమి ఉదయ్ ఆధ్వర్యంలో స్థానిక కొండా వెంకటప్పయ్య కాలనీలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తొలుత చుట్టుగుంట దగ్గర నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయ బాబు మాట్లాడుతూ తాను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ ను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతీ రెల్లి కులస్థుడు గుండెల్లో పెట్టుకున్నారన్నారు. ఇన్నాళ్లు రాజకీయ పార్టీలు కులాలను విడదీస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలతో అణగారిన వర్గాల ప్రజలకు తీరని అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. కులాలను కలిపే దిశగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని మార్కండేయ బాబు అన్నారు. నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ అణగారిన వర్గ ప్రజల్లో తాము కూడా అధికారంలో భాగస్వామ్యం అవ్వాలన్న ఆలోచనే రాకుండా ఇన్నాళ్లూ అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా వ్యవహించాయని విమర్శించారు. సమాజంలో రెల్లి కులస్తులు చేసే విధులు ఎంతో అమూల్యమైనవని వారు భగవంతుడు రూపంలో ఉన్న మనుషులుగా ప్రతీఒక్కరూ చూడాలన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ తమకు అత్యంత గౌరవాన్ని ఇస్తున్న పవన్ కళ్యాణ్ కు తాము ఋణపడి ఉంటామన్నారు. దశాబ్దాల కాలంగా అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని, వారు ఎదురుకుంటున్న సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిష్కరిస్తారన్న నమ్మకం తమకు ఉందని శంకరరావు అన్నారు. వీర మహిళ పాకనాటి రమాదేవి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను, దాష్టీకాలను కాలదన్ని ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చిన దళితులను, రెల్లి కులస్థులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. తమ పార్టీలో దళితులకు, ముస్లిం మైనారిటీలకు, బీసీలకు అగ్రపీఠం అంటూ చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం వారిని గతంలో ఏ ప్రభుత్వమూ చేయనంత ద్రోహం చేసిందని విమర్శించారు. అనంతరం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో జిల్లా నగర నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు ప్రసాద్, బండారు రవీంద్ర, బుడంపాడు కోటి, మెహబూబ్ బాషా, చెన్నా శ్రీకాంత్, ముత్యాల వెంకటేశ్వర్లు, దొంత నరేష్, మధు నాయక్, సోమి శ్రీను, షర్ఫుద్దీన్, త్రిపుర, సుంకే శ్రీనివాస్, అజయ్, నాగార్జున, కోలా అంజి, భూషణం, భూషయ్య, దాసరి వెంకటేశ్వర్లు, పుల్లంసెట్టి ఉదయ్, పులిగడ్డ గోపి, నవీన్ బందెల, కోనేటి ప్రసాద్, వడ్డె సుబ్బారావు, పురాణం కుమార్, ఇల్లా శేషు, మధులాల్, మిరియాల వెంకట్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.