మాస్కులు కుట్టిన మహిళలకు బకాయిలు చెల్లించని ఏపీ సర్కార్: దారం అనిత

మదనపల్లి: కోవిడ్ సమయంలో మాస్కులు కుట్టిన మహిళలకు మూడేళ్లుగా బకాయిలు చెల్లించని ఏపీ సర్కార్.. ఈసమస్య పై జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ.. కరోనా వైరస్ విజృంభించగా మాస్కులు లేనిదే బయటకు వచ్చే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు మాస్కులు ధరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మదనపల్లి మండల పరిధిలోని ఐదు మహిళా సంఘాలకు మాస్కులు కుట్టే బాధ్యతను అప్పగించింది. తమకు ఉపాధి దక్కిందన్న సంతోషంలో మహిళలంతా యుద్ధ ప్రాతిపదికన పెట్టుబడి పెట్టి మాస్కులు కుట్టే పని చేపట్టారు. ఒక్కో మాస్కు మూడు రూపాయలతో కొంటామని డిఆర్డిఏ తరఫున వీరికి అవకాశం కల్పించారు. మహిళలు సొంతంగా వస్త్రాన్ని తీసుకొచ్చి మాస్కులు కుట్టి అప్పగించారు. మదనపల్లి మండలంలో దాదాపు 3,40,000 మాస్కులకు పైగా తయారుచేసి మహిళలు అప్పగించారు. వీటిని పట్టణ. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు పంపిణీ చేశారు. వీటికి సంబంధించి బకాయిలు మాత్రం నేటికీ వారికి అందలేదు, అందుకోసం అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి డివిజన్ లోని అన్ని మండలాల్లో దాదాపు 80 మందికి పైగా మహిళలు పనిచేశారు. గుత్తేదారులు పెట్టిన పెట్టుబడి రాకపోగా వీరి వద్ద పనిచేసిన మహిళా దర్జీలకు కూలి చెల్లించేందుకు అప్పులు చేయాల్సి వచ్చింది. పలువురికి అరకొర చెల్లించగా మిగిలినవారు ఘర్షణకు దిగుతున్నారు.. దీంతో మహిళా సంఘాల్లో రుణాలు తీసుకొని చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మదనపల్లె కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం వీకోటలో పలు మహిళా సంఘాల్లోని దర్జీలకు ఇంతవరకు బకాయిలు అందలేదు మదనపల్లి మండలంలోని 30 లక్షల వరకు దుకాయిలు చెల్లించాల్సి ఉంది కరోనా పని సమయంలో పనిచేసినందుకు మూడేళ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప తమకు మిగిలింది ఏమీ లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన పెట్టుబడిని చెల్లించాలని జనసేన పార్టీ తరపున దారం అనిత డిమాండ్ చేసారు.