సర్వే చేయించి, రొడ్డు నిర్మాణం చేపట్టాలని జనసేన వినతి పత్రం

అవనిగడ్డ: లంకమ్మ మాన్యంలో అంతర్గతంగా వున్న నల్లమ్మ మామ్మ ఇంటి రోడ్డు వెయ్యడానికి చాలా రోజుల తర్వాత పంచాయితీ వారు మోక్షం కలిగించారనుకొనే సమయంలో.. ఆ రోడ్డు 6 ప్లాట్ల వరకు రొడ్డు నిర్మాణం జరుగుతుందని, మిగిలిన 20 ఇళ్ళవారికీ రోడ్డు వెయ్యకుండా రోడ్ స్థలం ఆక్రమణకు గురైంది, రొడ్డు వెయ్యటానికి కుదరదని అక్కడి నిర్వాసితులకు సదరు కాంట్రాక్టర్ చెప్పగా.. ఆ రొడ్డును సర్వే చేయించి వెయ్యాలని సోమవారం గ్రామ పంచాయితి సర్పంచ్ కి మరియు ఈ.ఓ కి, మండల తహశీల్దార్ వారికి వివరించి నిర్వాసితుల తరఫున జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ కమిటీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే పక్కన వున్న పొలాల వారు దొంగ చాటుగా మార్చిన సర్వే రాళ్ళను కూడా ఫోటో రూపంలో ఇవ్వడం జరింది. ఈ విషయంపై వారు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సోమవారం జనసేన పార్టీ అవనిగడ్డ టౌన్ కమిటీ అధ్యక్షులు రాజనాల వీరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, జనసేన పార్టీ టౌన్ కమిటీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి బోగోది రాజ్యలక్ష్మి, మరియు ఉపాధ్యక్షులు ఆళ్ళమళ్ళ చందు బాబు, జనసేన పార్టీ టౌన్ ప్రధాన కార్యదర్శి అన్నపరెడ్డి ఏసుబాబు, కార్యదర్శులు అశోక్, జనసైనికులు మరియు నల్లమ్మ మామ్మ రోడ్డు లోని నిర్వాసితులు పాల్గొనడం జరిగింది.