విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఎం.ఈ.ఓ కు జనసేన వినతి పత్రం

ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో వసతులు లేక ఇబ్బందుల పడుతున్న విద్యార్థుల సమస్య పై స్పందించి.. సమస్యను పరిష్కరించాలని ఎం.ఈ.ఓ కు వినతి పత్రం అందించిన జనసేన నాయకులు

జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన కార్యదర్శి మూల హరీష్ గౌడ్ మరియు జనసేన ఉమ్మడి కరీంనగర్ యువజన అధ్యక్షులు రావుల మధు సూచనల మేరకు రామగుండం నియోజకవర్గంలోని మునిసిపల్ కార్పొరేషన్ 1వ డివిషన్ విలేజ్ రామగుండం లోని జెడ్.పి.హెచ్.ఎస్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధుల సమస్యలను జనసేన రామగుండం నియోజకవర్గం నాయకులు రావుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో జనసేన రామగుండం మండల యువజన సభ్యులు పాఠశాలను సందర్శించి త్రాగు నీరు సమస్య, పాఠశాల ముందే మురికి నీరు నిలకడగా ఉంటున్నాయి మరియు ముత్రశాల్ల సౌకర్యం లేక చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారని.. నీటి సదుపాయం లేక పక్కన ఉన్న 300 మీటర్ల దూరంలో ఉన్న మసీద్ లోకి పురుగులు ఉన్న మురికి నీళ్ల లో నుండి వెళ్లి నీళ్లు త్రాగుతున్నారు. దయచేసి పిల్లల సమస్యని వెంటనే పరిష్కరించాలని రామగుండం మండల యువజన అధ్యక్షులు ఏమూర్ల రంజిత్, ఎం.ఈ.ఓ ఆఫీసర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మోతే రవికాంత్, చిట్టి రాజశేఖర్ బండారీ తిరుపతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పోట్ల శశాంక్, దాసరి శశాంక్, సెక్రెటరీ లోకేష్, ఎగ్జిక్యూటివ్ మెబర్స్ ఆశ్రిత్ గౌడ్, తిప్పారపు సురేష్, జనసైనికులు పాల్గొన్నారు.