తెదేపా రిలే దీక్షకు నిడదవోలు జనసేన సంఘీభావం

నిడదవోలు నియోజకవర్గం: సమిశ్రగూడెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరాసనగా తెదేపా నియోజకవర్గం ఇంచార్జి బూరుగుపల్లి శేషరావు చేస్తున్న రిలే నిరాహార దీక్షకు నిడదవోలు మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పోలిరెడ్డి వెంకటరత్నం మాట్లాడుతూ రాజమండ్రి సెంట్రల్ జైలులో మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించి, రానున్న ఎన్నికల్లో జనసేన మరియు టీడీపీ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాం అని ప్రకటించిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలో వైసీపీ అరాచక, అవినీతి పాలన అంతమొందించాలంటే అన్ని పార్టీలు కలిసి పోటీ చేసి వ్యతిరేకత ఓటు చీలకుండా వైసీపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధఃపాతాళానికి వెల్లెట్టు చెయ్యాలని పవన్ కళ్యాణ్ గారు వేసిన వ్యూహంతో కంగుతిన్న జగన్ రెడ్డి మరియు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు పవన్ కళ్యాణ్ గారి పైన చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారని మండి పడ్డారు. ఎటువంటి స్వార్థం లేకుండా, రాజకీయాలు చూడకుండా కష్ట కాలంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి, టీడీపీ క్షేత్ర స్థాయి కార్యకర్తలకు బరోసా ఇచ్చే విధంగా ఉధార మనస్తత్వంతో పవన్ కళ్యాణ్ గారు నిలవడాన్ని చూసి ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలను, నిర్ణయాలను క్షేత్ర స్థాయిలో బలంగా తీసుకెళ్ళి ఆయన నాయకత్వం ప్రజలకి అందించేలా పని చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం ( పీవీఆర్), పాలా వీరాస్వామి, టౌన్ నాయకులు రంగా రమేష్, వీరమహిళ బెల్లపుకొండ పుష్పవతి, పెండ్యాల ఎంపీటీసీ ఇంద్రగౌడ్, మేడా పూర్ణ, పాలకోడేటి గోపినాధ్, యడ్లపల్లి సత్తిబాబు, మద్దిరాల చిన్నా, పవన్, బాలు, రాజేష్, మండలం కమిటీ సభ్యులు, జనసేన నాయకులు,వివిధ గ్రామాల అధ్యక్షులు, జనసైనికులు పాల్గొన్నారు.