జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కలిసికట్టుగా పనిచేద్దాం

  • కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఎంపిటిసి ఎరుకల పార్వతి

కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం, జనసేన పార్టీని ముందుకు తీసుకు వెళ్ళడానికి ఒక చిన్న మార్గం దాదాపుగా కర్నూలు జిల్లాలో 54 మండలాలు ఉన్నాయి. ప్రతి మండలంలోని 30 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకుందాం. ఉదాహరణకు మన కర్నూలు జిల్లా ఆలూరు మండలంని ఎంచుకున్నాం. ఆలూరు నియోజకవర్గానికి ఆరు మండలాలు. ఆలూరు మండలం దేవనకొండ మండలం హోళగుంద మండలం ఆస్పరి మండలం హాలహర్వి మండలం చిప్పగిరి మండలం. ఆలూరు మండలంలోని మీటింగ్ పెట్టాము అనుకుందాం. ఆలూరు మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి. ఆలూరు మండలానికి 18 గ్రామాలు ఉన్నాయి. ప్రతి గ్రామం నుంచి సమస్యలను వీడియో ద్వారా పేపర్ ద్వారా వ్రాసుకోవాలి. ప్రతి మండలంలో 30 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటాం. ఆ మీటింగ్ లో ప్రతి సమస్యలను తెలియజేయాలి తెలియజేసిన ప్రతి ఒక్క జనసేన యూత్ మీటింగ్ లో పాల్గొనాలి. అలాగే సమస్యలను పరిష్కరించడానికి జనసేన లీడర్స్ జనసేన గ్రామ యూత్ ఆలోచించాల్సి ఉంటుంది. 30 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవడం వల్ల ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటాం. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వంకు తెలియజేయడం వల్ల రాబోయే 2024లో మన జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్లడానికి ఒక చిన్న మార్గం అని అనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు పోవడం వల్ల 2024లో జనసేన పార్టీ బలంగా ఉంటుంది. ఇలా చేయకపోవడం వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజల్లో ఒక ఊహాగానం ఉండిపోయింది. అధికారంలో ఉన్నవాళ్లు ఏ పనులు చేయలేక పోతున్నారు అధికారంలో లేని వాళ్ళు ఏం చేయగలరు అని ఊహాగానం ఉండిపోయింది. అలాంటి ఆలోచన ప్రజలకు రాకుండా ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరించేలా ప్రజలతో కలిసి పోరాడుదాం. ప్రజలతో మమేకం అవ్వడం వల్ల 2024లో జనసేన పార్టీ ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక చిన్న మార్గం అనుకుంటున్నాను మన భవిష్యత్తు మారాలంటే మన పిల్లల భవిష్యత్తు మారాలంటే మనలో మార్పు రావాలి. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గ్రామ యాత్రను మొదలు పెట్టబోతున్నారు. అంటే ప్రతి జిల్లా ప్రతి మండలంలో పర్యటిస్తున్నారు. ఇందుకోసం ప్రజల సమస్యలను తెలుసుకుంట ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మనం కలిసికట్టుగా పని చేయాల్సి ఉంటుందని కర్నూలు జిల్లా, ఆలూరు నియోజకవర్గం ఎంపిటిసి ఎరుకల పార్వతి అన్నారు.