రాజాంలో జనసేన కోసం జనబాట మరియు బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ

రాజాం నియోజకవర్గం, రాజాం టౌన్ లో 21 వార్డులో రాజా నియోజకవర్గ ఇన్చార్జ్ ఎన్ని రాజు ఆధ్వర్యంలో జనసేన కోసం జనబాట మరియు బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ని రాజుగారు మాట్లాడుతూ రాబోయేది జనసేన పార్టీ – టిడిపి పార్టీ ఉమ్మడి ప్రభుత్వమని, ఈ అరాచక వైసిపి పార్టీ పాలనకు స్వస్తి పలకడానికి ప్రజలందరూ వేచి ఉన్నారని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను సేవా కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి జనసేన-టిడిపి ఉమ్మడి కరపత్రాలను పంపిణీ చేస్తూ రాజాం నియోజవర్గంలో ప్రతిరోజు కార్యక్రమం నిర్వహిస్తున్నారు.