అశేష ప్రజానీకానికి చేరువగా “జనంలో జనసేన”

  • రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో “జనంలో జనసేన” కార్యక్రమం

రాజంపేట నియోజకవర్గం: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట పట్టణంలో ప్రతిఇంటికి జనసేన పార్టీ సిద్దాంతాలు, ఎన్నికలగుర్తు “గాజు గ్లాస్” ను వివరించే విధంగా గత కొన్ని రోజుల నుండి నియోజకవర్గ వ్యాప్తంగా “జనంలో జనసేన” కార్యక్రమం రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో విజయవంతంగా సాగుతుంది. ఆదివారం పట్టణంలోని యస్.వి నగర్, కృష్ణా నగర్, ఆర్.యస్.రోడ్డు లలో జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ జెడ్పీటీసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, నాసర్ఖాన్, పివిఆర్ కుమార్, పత్తి నారాయణ, అల్లం సుబ్రహ్మణ్యం, కె.ఆర్, మౌల, వీరయ్య, సాయిరాజు, రమణ, వీరమహిళలు సుహాసిని, చిన్నమ్మి, మదులత, చెంగమ్మ, నూరి, లక్ష్మీ, స్నేహలత, మౌనిక, లోలా, అరుణ తదితరులు పాల్గొన్నారు.