జనంతో జనసేన కార్యక్రమం.. మొదటి రోజు

ఆమదాలవలస నియోజకవర్గంలో, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎం.పీ.టీ.సీ) ఆధ్వర్యంలో జనంతో జనసేన కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు గిరిజన గ్రామాలైన బూర్జ మండలం, బొమ్మిక, గోపిదేవి పేట గ్రామాలలోప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ చేసే సేవా కార్యక్రమాల గురించి మరియు వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి, గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తులగాపు మౌళి, ధూబా సంఘం నాయుడు, సేపన రమేశ్, కిల్లాన నరేష్, ప్రసాద్, బుజ్జి, జనసేన కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసారు.