ప్రశ్నించే గొంతును హౌస్ అరెస్టులు చేసి ఆపలేరు

  • టీటీడీ పాలక మండలి పద్ధతి మార్చుకోవాలి.
  • తక్షణమే ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలలో జగన్ ఫోటో తొలగించాలి
  • జనసేన డిమాండ్

తిరుపతి, టీటీడీ పాలక మండలి పద్ధతి మార్చుకోవాలని, తక్షణమే ఉద్యోగులకు ఇస్తున్న ఇళ్ల పట్టాలలో జగన్ ఫోటో తొలగించాలని జనసేన బుధవారం ధర్నాకు పిలుపునివ్వగా తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షుడు రాజారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషినిలతో పాటు పలువురు నేతలను గురువారం తిరుపతిలో వారి ఇళ్లవద్ద పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టులను ఖండించిన కిరణ్ రాయల్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును హౌస్ అరెస్టులు చేసి ఆపలేరని, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగేలా పాలకమండలి ఉద్యోగులకు ఇస్తున్న పట్టాలపై జగన్మోహన్ రెడ్డి ఫోటోలను వైసీపీ ప్రచారాలను తొలగించమన్నందుకు అక్రమ అరెస్టులు చేయడం ఏంటని, టీటీడీని బ్రస్టు పట్టిస్తుంటే మేము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని, పట్టాలపై వైసీపీ ప్రచారాలను తొలగించాలని అధికార పార్టీని వారు డిమాండ్ చేశారు.