లొద్దపుట్టిలో ఘనంగా జనసేన క్రీయాశీల సభ్యత్వ పంపిణీ కార్యక్రమం

ఇచ్చాపురం, లొద్దపుట్టిలో జనసేన క్రీయాశీల సభ్యత్వ పంపిణీ కార్యక్రమం ఘన విజయంగా జరిగినది. మొత్తంగా 100 జనసేన క్రీయాశీల సభ్యత్వ కిట్లు కార్యకర్తలకు అందించటం జరిగింది. జనసేన సిద్ధాంతాలను నమ్మి సుమారుగా 30 కుటుంబాలు నూతనంగా జాయిన్ అవ్వటం జరిగింది. అలాగే లొద్దపుట్టి జనసైనికులు, పోలీస్ శాఖలో పని చేస్తున్న సోమేశ్వరరావు సేవలు గుర్తించి సన్మానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన ఇచ్చాపురం నియోజకవర్గ ఇంచార్జి దాసరి రాజు, జనరల్ సెక్రటరీ దుర్యోధన రెడ్డి, మత్సకార కార్యదర్శి హరి బెహేరా, ఇచ్చాపురం జడ్పిటిసి అభ్యర్థి తిప్పన నీలవేణి రెడ్డి మరియు జనసేన వీరమహిళ భాసి భారతి, భాస్కర్, సంతోష్, సాయి, హర్ష, చలపతి మరియు ఇతర జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.