సర్వేపల్లిలో జనసేన క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ కార్యక్రమం

సర్వేపల్లి నియోజకవర్గం: సర్వేపల్లిలోని వెంకటాచలం మండలం, సర్వేపల్లి గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు అదివారం క్రియాశీలక సభ్యత్వాలు పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి అధ్యక్షతన సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడితో కలిసి మనుక్రాంత్ రెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంటే ఏ రాజకీయ పార్టీ కూడా ఆ పార్టీ కార్యకర్తలకు గాని, నాయకులు గాని, వారి కుటుంబాలకు గాని అండగా ఉండాలి అనే ఆలోచన లేదు. మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలు, జనసేన నాయకులు, జనసైనికుల కుటుంబాలకు అండగా క్రియాశీలక సభ్యత్వాలని రెండో విడత కొనసాగించి. అందులో భాగంగా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఏదైతే క్రియాశీలక సభ్యుడు బైక్ యాక్సిడెంట్ అయితే 50వేల రూపాయల వరకూ హాస్పటల్ ఖర్చులకి అదే విధంగా ఏదైనా ప్రమాదవశాత్తు ప్రాణాన్ని కోల్పోతే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా అందే విధంగా క్రియాశీలక సభ్యత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రియాశీలక సభ్యత్వాలతోపాటు జనసైనికులకు జనసేన కుటుంబాలకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. రాక్షసపాలన నుంచి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలని విముక్తి చేయడమే జనసేన పార్టీ లక్ష్యం ఆ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంది. అదేవిధంగా రాబోయేది జనసేన కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే వారహీ విజయత్ర మూడో విడత ఆగస్టు 10వ తారీఖు నుంచి కొనసాగుతుంది. ప్రజల్లో ఒక ఆలోచనని తీసుకువచ్చే విధంగా ఈ యాత్రలో కొనసాగుతా ఉన్నాయి. అనేక విషయాలపై ఈ వారాహి విజయ యాత్రలో ప్రజలకి రాష్ట్రవ్యాప్తంగా తెలియజేసే విధంగా ఆయన యొక్క వ్యూహం ముందుకు వెళ్తుంది. ఈ వ్యూహాన్ని అనుసరించి ప్రతి ఒక్క జనసైనికుడు జనసేన నాయకుడు కూడా జనసేన సిద్ధాంతాలను ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా పనిచేస్తాం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పినిశెట్టి మల్లికార్జున్, రహీం, ముత్తుకూరు మండల అధ్యక్షులు గణపతి, మనుబోలు మండల అధ్యక్షులు పెనుబాక ప్రసాద్, శ్రీహరి, సందీప్, జాకీర్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.