అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న జనసేన మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు

కొండేపి: జనసేన పార్టీ జిల్లా నాయకత్వం అక్రమ మైనింగ్ గత నాలుగు రోజుల క్రితం కూడా అడ్డుకున్నా.. చర్యలు నామ మాత్రమే, ప్రకాశం జిల్లా, కొండేపి నియోజకవర్గం, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రావినూతల కోటి వారి బృందం అక్రమ మైనింగ్ జరుగుతుందని గ్రామ ప్రజలు ద్వారా తెలుసుకొని వారు వెళ్లి నివారించగా, అధికారుల అండ చూసుకొని వారి ఇష్టారాజ్యంగా మాట్లాడారని జనసేన పార్టీ అధ్యక్షులకు వివరించారు. విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు అందరూ అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించి వీఆర్వో కి ఫోన్ చేయగా ఒంగోలులో ఉన్నానని, అలాగే ఎమ్మార్వో సెలవులో ఉన్నారని, మరి డిటి వెంకటేశ్వరావు కి ఫోన్ చేస్తే వస్తున్నాం అంటూ రాకుండా ఉండడం పై అధికారుల పర్యవేక్షణలోనే అక్రమ మైనింగ్ జరుగుతుంది అని జనసేన పార్టీ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రజలు నమ్మవలసి వస్తుంది. మైనింగ్ సంబంధించిన విజిలెన్స్ అధికారులు మురళీకృష్ణ కి విషయాన్ని తెలియపరచగా వారు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని అక్రమంగా మైనింగ్ జరిగిందని గుర్తించి కొలతలు వేసుకొని మైనింగ్ ని తువ్వుతున్న జెసిపి నీ సీజ్ చేసి సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎస్సై కి అప్పజెప్పినారు. ఈ సమస్యపై స్పందించని సింగరాయకొండ రెవిన్యూ అధికారులకు అక్రమ మైనింగ్ లో ఎంత వాటా ఉందో పై అధికారులునిగ్గు తేల్చాల్సిందేనని జనసేన పార్టీ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఎమ్మార్వో ని కలిసి నివేదిక ఇచ్చి గవర్నమెంట్ ల్యాండ్స్ ఎవరెవరికి ఇచ్చారో నిగ్గు తేల్చాలని జరిగిన ఘటనపై చర్యలు తీసుకోవాలని అలాగే అక్రమ మైనింగ్ ను నిలిపి వేయాలని, అక్రమంగా మైనింగ్ తరలించిన ఫణీంద్ర పై కేసు నమోదు చేయాలని జనసేన పార్టీ మరియు ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్ మరియు జనసేన నాయకులు, ఎమ్మార్పీఎస్ నాయకులు రావినూతల కోటి వారి బృందం పాల్గొనడం జరిగినది.