గూడూరులో జనసేన, టీడీపీ సమన్వయ ఆత్మీయ సమావేశం

గూడూరు: జనసేన, టీడీపీల కేంద్ర కార్యాలయాల సమన్వయ నిర్ణయంలో భాగంగా గూడూరు నియోజకవర్గంలోని తాళ్ళమ్మ ఆలయ ప్రాంగణంలోని శ్రీ శ్రీనివాస కల్యాణమండపంలో గురువారం జనసేన, టీడీపీల పట్టణ, మండలాల కార్యవర్గం, లీగల్ సెల్, ఐటీ టీం, సోషల్ మీడియా టీంలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు భవిష్యత్తులో అధికార పార్టీని గద్దె దించే దిశగా అందరం ఐకమత్యంతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి 2024 ఎలక్షన్ లో ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విజయకేతనం ఎగరవేసే విధంగా ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ విజ్ఞప్తి చేశారు. టిడిపి, జనసేన పార్టీ నాయకులు గూడూరు గ్రామ దేవత తాళమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు పలు ప్రతిపాదనలను చర్చించారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ బూత్ లకు సంబంధించి కమిటీలను ఏర్పాటు చేసుకుందామని, సమయం తక్కువగా ఉన్నందున ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసే ఉమ్మడి అభ్యర్థి విజయానికి పనిచేయాలని కోరారు. జనసేన పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు, కేర్ టేకర్ తీగల చంద్రశేఖర్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు జగన్మోహన్ రెడ్డి రహిత రాష్ట్రం కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి సమన్వయంతో పనిచేసే ఉమ్మడి అభ్యర్థి విజయానికి జనసేన పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీల శ్రేణుల మధ్య ఎటువంటి సమస్యలు తలెత్తిన మండల మరియు నియోజకవర్గస్థాయి టిడిపి మరియు జనసేన పార్టీ నాయకులు దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని సూచించారు . జనసేన, టీడీపీ సమావేశాల నిర్వహణ సంప్రదింపుల సమన్వయ బాద్యులు కె మోహన్ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సంఘటితంగా ఉంటూ ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గూడూరు పట్టణ, రూరల్, కోట, వాకాడు, చిట్టమూరు మండలం జనసేన అధ్యక్షులు పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్, పాలిచర్ల భాస్కర్, దామరాపు బాలసుబ్రమణ్యం, రౌతు శివ, గుండుబోయిన వాసు, చిల్లకూరు మండలం వంశీ, మనోజ్, కార్తీక్, మహేష్ నియోజకవర్గం నాయకులు అలిమెలి రాజశేఖర్, నాగార్జున, విష్ణు, అద్దెపూడి సాయి, స్వరూప్, సూర్య, సంతోష్,అక్బర్, క్రాంతి, సుమన్, పోలయ్య, జగదీష్, మస్తాన్, టీడీపీ నాయకులు శీలం కిరణ్ కుమార్, నెలబల్లి భాస్కర్రెడ్డి, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, పిల్లెల్ల శ్రీను, ఇజ్రాయిల్ కుమార్, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు.