టీటీడీ FMS కార్మికులకు భోజన వసతి ఏర్పాటు చేసిన జనసేన

టీటీడీ FMS కార్మికుల న్యాయపోరాటానికి అండగా వారికి మూడవ రోజు కూడా భోజన వసతులను ఏర్పాటు చేసిన జనసేన

గత 9 రోజులుగా టీటీడీ FMS కార్మికులు తిరుపతి ఎడి బిల్డింగ్ వద్ద మాకు న్యాయం చేయండి అని చేస్తున్న నిరసనకు మద్దతుగా జనసేన వారి సమస్యల పరిష్కారం కొరకు ఎంత దూరమైన పోరాడుతామని మీకు అండగా మేమున్నామంటూ… శనివారం మధ్యాహ్నం సుమారు 1800 మందికి పైగా తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో వారికి భోజన వసతులను ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీ కిరణ్ రాయల్ మాట్లాడుతూ మీకు ఎప్పుడూ అండగా జనసేన పార్టీ ఉంటుంది మనందరం కలిసి అలిపిరి వద్ద ఈ ప్రభుత్వాన్ని, టీటీడీ పాలకమండలిని మీకు న్యాయం జరిగే వరకు ప్రశ్నిద్దాం, నిలదీద్దాం అవసరమైతే ముట్టడిస్తామని వారికి భరోసానిచ్చారు.

అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శ్రీ హరిప్రసాద్ మాట్లాడుతూ మీది న్యాయమైన పోరాటం నిన్న ముఖ్యమంత్రి గారు మీకు హామీ ఇవ్వకుండానే వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఎలక్షన్లకు ముందు ఒక మాట ఎలక్షన్ తర్వాత మరో మాట మాట్లాడే ఈ సీఎం కు ఇప్పటికైనా మనసు మారి మీకు న్యాయం చేకూర్చాలని జనసేన పార్టీ తరపున మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.