వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో పేదప్రజల దగ్గర ప్రభుత్వం డబ్బులు వసూళ్ళు మానుకోవాలి: జనసేన పార్టీ

అవనిగడ్డ నియోజకవర్గం, పేద ప్రజల దగ్గర వన్ టైమ్ సెటిల్మెంట్ పేరుతో డబ్బులు వసూలు చేయడం దురదృష్టకరం అవనిగడ్డ నియోజకవర్గం జనసేన ఖండించింది. జనసేన పార్టీ మాస్టర్ ట్రయినర్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రాయపూడి వేణుగోపాల్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత కొద్దిరోజులు నుండి ఓట్శ్ పేరుతొ నీరు పేదలు దగ్గర రాష్ట్రా ప్రభుత్వం 10 వేలు, 20 వేలు, 30 వేలు రూపాయలు కడితే ఇళ్ళు ఇళ్లస్థలం రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని దోపిడికి దిగటం చాలా బాధాకరం. ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బులు కట్టండని అధికారులు వేడించటం ఏమిటి? అధికారులు, నియోజకవర్గం MLA సైతం అవగాహనా సదస్సులు పెట్టి మరి చెప్పటం విడ్డురంగా ఉంది. డబ్బులు కట్టకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని వాలంటీర్స్ ద్వారా చెప్పించటంతో పేదప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చి 30 నెలలు అయినా ఒక్క ఇల్లు కట్టియకపోగా, 40 ఏళ్ళ క్రితం కట్టుకున్న ఇళ్లకు ఈ విధంగా డబ్బులు వసూళ్ళు పేరుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం దర్మం కాదు. గత 40 ఏళ్ళ నుండి ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, ఏ ఒక్క ముఖ్యమంత్రి పేద ప్రజలకు ఇబ్బంది కలిగించలేదు. గత రెండు ఏళ్ళ నుండి ప్రజలు కరోనాతో అల్లాడిపోతు, పనులు లేక కుటుంబాలు గడవక జీవన స్థితి అల్లకల్లోలంగా ఉంటే OTS పేరుతో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం వసూళ్ళు చేసే విధానంను జనసేన పార్టీ తరుపున ఖండిస్తున్నాము. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఈ OTS ద్వారా డబ్బులు వసువుళ్ళు కార్యక్రమం విరమించుకోవాలని, అదే విధంగా అవనిగడ్డ నియోజకవర్గంలో నీరుపేద కుటుంబాలకు ఈ విధానం పెనుభారం కాబట్టి ఈ విషయంలో MLA చొరవ తీసుకోని పెదప్రజలకు న్యాయం చెయ్యాలని జనసేన పార్టీ తరుపున కోరుచున్నాము. ఓట్శ్ విధానం ప్రభుత్వ వెనుకకు తీసుకోకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు.