తంగెళ్ళ నాగ చిరంజీవి కుటుంబానికి జనసేన భరోసా

పర్చూరు, సెప్టెంబర్ 8 వ తేదీన ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అయ్యి ఇల్లు కాలిపోయి, ఆస్తి నష్ట పోయిన, నిరుపేద జనసైనికుడు పార్టీకి అత్యధికముగా మెంబర్షిప్ లు కట్టించి, పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన తంగెళ్ళ నాగ చిరంజీవికి, వారి కుటుంబానికి జరిగిన ఈ విషయాన్ని, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొనిపోయి 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయించిన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ కి, జనసైనికుడైన తంగెళ్ల నాగ చిరంజీవి కుటుంబ సభ్యులతో పాటు, జిల్లా జనసైనికులు మరియు పర్చూరు నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. పార్టీ కోసం కృషి చేసే వారికి, పార్టీని నమ్ముకున్న జనసైనికులకు పార్టీ తప్పకుండ అండగా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ.