ఏలూరుపాడు గ్రామంలో జనసేన ఆత్మీయ సమావేశం

కాళ్ళ మండలంలో జనసేన పార్టీ బలోపేతం కోసం రోజుకి ఒక గ్రామం సందర్శించి గ్రామాల్లోని జనసేన సైనికులు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అలాగే పార్టీ పెద్దల ఆదేశాల మేరకు గ్రామ కమిటీలు నియమించడం, క్రియాశీలక సభ్యత్వం గురించి చర్చించడం జరుగుతుంది. అందులో భాగంగా ఏలూరుపాడు గ్రామంలోని జనసైనికులు, నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాళ్ళ మండల జనసేన నాయకులు, ఏలూరుపాడు గ్రామ జనసైనికులు నాయకులు పాల్గొనడం జరిగింది.