పుట్టపర్తిలో జనసేన ఆత్మీయ సమావేశం

పుట్టపర్తి నియోజకవర్గంలోని జానకి రామయ్య కళ్యాణ మండపం నందు జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు టి.సి.వరుణ్ విచ్చేసి అనంతరం వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి నాయకులకు మరియు సైనికులకు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. అలాగే మార్చి 14వ తేదీ ఆవిర్భావ సభకు అనంతపురం జిల్లా నుండి నాయకులు జనసైనికులు మరియు వీరమహిళలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు మండల అధ్యక్షులు, పుట్టపర్తి నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.