వర్షాలకు నీట మునిగిన పొలాలను పరిశీలించిన యడ్లపల్లి

పెడన నియోజకవర్గం: పెడన లజ్జబండ డ్రైన్ పూడిక తీతలు సరిగా తీయక వర్షాలకు నీరు నిలిచిపోయి నారుమడులు, వెదచల్లిన పొలాలన్నీ నీటమునిగి పోవడంతో పెడన మండలం కొంకేపూడి, కూడూరు గ్రామంలో లజ్జబండ డ్రైన్లను పరిశీలించి గ్రామంలోని పొలాలను సందర్శించిన పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్. రైతులతో మాట్లాడి పంట నష్టం గురించి తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్ళి రైతులకు న్యాయం జరిగే వరకూ రైతాంగానికి అండగా ఉంటామని రామ్ సుధీర్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గారావు, క్రోవి సుందరరాజు, బాలు మహేంద్ర, కొండ, సయ్యద్ షఫీ, వరుధు రాము, కొప్పినీటి శివమణి, గడ్డిగోపుల నాగ, వన్నెమ్రెడ్డి కిరణ్, నందం శివ స్వామి, బాకీ నాని, బాదం వినోద్, అంజిబాబు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.